'కేడి' ఆడియో రిలీజ్
నాగార్జున కథానాయకుడుగా కిరణ్ దర్శకత్వంలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన 'కేడి' చిత్రం ఆడియో ఆవిష్కరణ సంక్రాంతి రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఆడియో సీడీని నాగార్జున రిలీజ్ చేసి తొలి ప్రతిని మమతా మోహన్ దాస్ కు అందజేశారు. ఛాయాగ్రాహకుడు సర్వేష్ మురారి, గీత రచయితలు చిన్ని చరణ్, కృష్ణ చైతన్య, ఆదిత్య మ్యూజిక్ దయానంద్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
నాగార్జున మాట్లాడుతూ, సందీప్ చౌతా గతంలో తాను నటించిన 'నిన్నే పెళ్లాడతా', 'చంద్రలేఖ', 'సూపర్' చిత్రాలకు మంచి మ్యూజిక్ ఇచ్చారనీ, మళ్లీ ఇప్పుడు 'కేడీ'లో అన్ని సాంగ్స్ చాలా బాగా చేశారనీ ప్రశంసించారు. ఇదేరోజు మార్కెట్ లోకి ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో రీలీజ్ కావడంతో పాటు మంచి రెస్సాన్స్ కూడా వచ్చిందన్నారు. దర్శకుడు కిరణ్ చాలా స్టైలిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, సాంగ్స్ అనీ డిఫరెంట్ గా ఉంటాయనీ చెప్పారు. ఇందులో ఓ ఐటెం సాంగ్ ఉందనీ, దీనికోసం 1969లో వచ్చిన నాన్నగారి 'అదృష్టవంతులు' సినిమాలోని ము...మ్ము...మ్ముద్దంటే చేదా...సాంగ్ పెడదామని శివప్రసాద్ రెడ్డి చెప్పడం, ఆ ప్రకారమే రీమిక్స్ చేసి అందులో తాను నటించడం జరిగిందన్నారు. శివప్రసాద్ రెడ్డి బ్యానర్ లో ఈ చిత్రం మరో మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. మమతా మోహన్ దాస్ మట్లాడుతూ, 'కింగ్' తర్వాత 2009లో తాను ఏ తెలుగు సినిమా చేయలేదనీ, మళ్లీ ఇప్పుడు నాగ్ తో 'కేడి' చిత్రానికి పనిచేయడం హ్యాపీగా ఉందనీ చెప్పారు. శివప్రసాద్ రెడ్డి బ్యానర్ లో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉందనీ, కిరణ్ వర్కింగ్ స్టైల్ కూడా తనకు బాగా నచ్చిందనీ అన్నారు. ఇందులోని అన్ని పాటలు బాగున్నాయని చెబుతూ 'ఎందుకో...ఏమిటో' అనే పాట పల్లవిని పాడి వినిపించారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|