'కేడి' ఆడియో రిలీజ్
కామాక్షి బ్యానర్ లో అన్ని చిత్రాలు మ్యూజికల్స్ హిట్స్ అయ్యాయని శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మ్యూజిక్ అంటే తనకెంతో ఇష్టమనీ, కేడి చిత్రంలోని పాటలన్నీ డిఫరెంట్ గా ఉంటాయనీ చెప్పారు. సందీప్ చౌతా సాంగ్స్ కొత్తగా చేశారనీ, రెస్పాన్స్ కూడా చాలా బాగుందనీ అన్నారు. నాగార్జున తో కామాక్షి బ్యానర్ లో మరో సూపర్ హిట్ సినిమా ఇదని పేర్కొన్నారు. నాగార్జున 'డాన్'లోని 'ఎంతందంగా వున్నావే..' పాట తర్వాత తాను బిజీ అయ్యాననీ, 'కేడీ'లో ఇంచుమించు అన్నిపాటలూ తనతో రాయించి ప్రోత్సహించారనీ చిన్నిచరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో 'స్మార్ట్ అండ్ స్వీట్' అనే పాటను తాను రాసినట్టు మరో గీత రచయిత కృష్ణ చైతన్య తెలిపారు. ఆదిత్య మ్యూజిక్ దయానంద్ మాట్లాడుతూ, నాగార్జున, కామాక్షి మూవీస్ కాంబినేషన్ లో ఇది మరో మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందనీ, సందీప్ చౌతా ఎక్స్ టార్డినరీ మ్యూజిక్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోందనీ అన్నారు.
ఫిబ్రవరి మొదటివారంలో విడుదలకు రెడీ అవుతున్నఈ చిత్రంలో అమెరికా అమ్మాయి లిండా ఓ కీలక పాత్ర పోషించగా, 'స్లమ్ డాగ్ మిలయనీర్' ఫేమ్ అంకుర్, 'బండిట్ క్వీన్' ఫేమ్ నిర్మల్ పాండే, 'లగాన్' ఫేం అఖిలేంద్ర మిశ్రా, 'డాన్' విలన్ కెల్లీడార్జ్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, హర్షవర్ధన్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం కిరణ్ అందించగా, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, సెల్వ పైట్స్, శ్రవణ్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|