'అదుర్స్' యూనిట్ సంబరం
సంక్రాంతి కానుకగా ఈనెల 13న ప్రేక్షకుల మధ్యకు వచ్చిన 'అదుర్స్' చిత్రం ప్రేక్షకాదరణలో ముందుంది. ఎన్టీఆర్-నయనతార-షీలా హీరోహీరోయిన్లుగా కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ను సంస్థ కార్యాలయంలో వల్లభనేని వంశీ సోమవారం రాత్రి నిర్వహించారు. ఎన్టీఆర్, వినాయక్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, వల్లభనేని వంశీ, నల్లమలుపు బుజ్జి, ఛోటా కె.నాయుడు, రామ జోగయ్య శాస్త్రి, రామ్-లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
తొలుత వినాయక్ మాట్లాడుతూ, అదుర్స్ చిత్రాన్ని తన కెరీర్ లో నే అతి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు తన కృతజ్ఞతలనీ, రెండేళ్ల శ్రమకు దక్కిన ప్రతిఫలమిదని సంతోషం వ్యక్తం చేశారు. సినిమా ప్రారంభం నుండి నల్లమలుపు బుజ్జి దగ్గరుండి అన్ని విషయాలు చూసుకున్నారనీ, అలాగే కోన వెంకట్ సృష్టించిన చారి పాత్రకు ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయనీ అన్నారు. ఛోటా కె.నాయుడు అద్భుతమైన పనితీరు ప్రదర్శించారని ప్రశంసించారు. చారి పాత్రను ఎన్టీఆర్ మాత్రమే చేయగలడని ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో తాను చెప్పిన మాట ఇప్పుడు నిజమైందని అన్నారు. ఎన్టీఆర్ తల్లి కూడా తనకు ఫోన్ చేసి చారి పాత్రలో ఎన్టీఆర్ చాలా బాగున్నాడని మెచ్చుకున్నారనీ, ఈ సినిమా టైటిల్ పెట్టడానికి బి.ఎ.రాజు పట్టుదలే కారణమనీ చెప్పారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, ఇందులో ఎన్టీఆర్ గురువుగా తాను నటించాననీ, తెరవెనుక హీరో వి.వి.వినాయక్ అనీ అన్నారు. ఎన్టీఆర్ పుట్టకతోనే నటుడనీ, ఒక కమర్షియల్ హీరో బ్రాహ్మణ పాత్రను చేయడం అనేది చాలా సాహసోపేతమైన విషయమనీ అన్నారు. ఎన్టీఆర్ ప్రమాదానికి గురైనప్పటికీ చివరి పాటలో అద్భుతంగా డాన్స్ చేశాడని ప్రశంసించారు. షూటింగ్ పూర్తయిన తర్వత వినాయక్ తనకు ఒక రిస్ట్ వాచ్ ఇచ్చారని తెలిపారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|