ఎన్టీఆర్ 'శక్తి' ప్రారంభం
ఎన్టీఆర్ కథానాయకుడుగా సి.ధర్మరాజు సమర్పణలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'శక్తి'. మెహర్ రమేష్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైద్రాబాద్ గౌచ్చీబౌలీలోని గోల్ఫ్ కోర్ట్ ప్రాంగణంలో చలనచిత్ర ప్రముఖుల మధ్య గురువారం వేడుకగా ప్రారంభమైంది. దేవుని పటాలకు ఎన్టీఆర్ నమస్కరిస్తుండగా తీసిన ముహూర్తం సన్నివేశానికి దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ ఇవ్వగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్, శ్రీనువైట్ల తదితర ప్రముఖులు హాజరయ్యారు.
అనంతరం అశ్వనీదత్ మాట్లాడుతూ, 1975 జనవరిలో నటరత్న ఎన్టీఆర్ వైజంతీ మూవీస్ కు నామకరణం చేశారనీ, ఎన్టీఆర్ హీరోగా 'ఎదురులేని మనిషి' చిత్రం షూటింగ్ ఘనంగా ప్రారంభించామనీ అన్నారు. ఆ ఎన్టీఆర్ తో ప్రారంభించి నేటి 35వ వసంతంలో ఈ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ తో ఇది 3వ సినిమా కావడం, మూడోతరం వారసుడితో పనిచేస్తుండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆరు నెలలుగా భారవి, సత్యానంద్, తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్ తదితరులు ఎంతో కష్టపడి అద్భుతమనైన స్క్రిప్టు రెడీ చేశారనీ, బడ్జెట్ లిమిట్ లేకుండా సినిమా చేస్తున్నామనీ అన్నారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ, తన తొలి సినిమా 'కంత్రీ' ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో చేయడం అదృష్టమైతే మళ్లీ ఇంత త్వరగా అదే హీరోతో రెండో సినిమా చేయడం అంతకంటే ఎక్కువ అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వైజయంతీ మూవీస్ లాంటి ప్రిస్టేజియస్ బ్యానర్ లో సినిమా చేసే అవకాశం రావడం గొప్ప అవకాశమని అన్నారు. ఆరు నెలల ముందే దత్ గారు బడ్జెట్ లిమిట్స్ లేకుండా పెద్ద సినిమా చేయాలని అన్నారనీ, టెక్నికల్ స్టాండర్డ్స్ లో నా రెండు చిత్రాల కంటే గొప్పగా చేయాలని కమిట్ అయ్యాయనీ అన్నారు. ఫిబ్రవరి 5 నుంచి జైపూర్, జోధ్ పూర్, రాజస్థాన్ లలో మొదటి షెడ్యూల్ జరిపి, రెండో షెడ్యూల్ కాశ్మీర్, లడక్, మూడో షెడ్యూల్ హంపి, మైసూర్, హృశికేష్, ఢిల్లీ, ఆగ్రా, ఆ తర్వాత ఈజిప్ట్, కైరో, లండన్ లలో చిత్రాన్ని పూర్తి చేస్తామనీ చెప్పారు. మహా సంకల్పంతో టెక్నీషియన్లందరి సహకారంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరపై తీసుకొస్తామని అన్నారు. ఇదొక యూనీక్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ అనీ, విజువల్ ఫీస్ట్ అనీ చెప్పారు. ఎన్టీఆర్ నటనాశక్తిని చూపించే చిత్రం ఈ 'శక్తి' అనీ, తొందరలోనే పూర్తి చేసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తామనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|