|
|
Articles: TP Features | గుణపాఠం ఇంకెప్పుడు? - Prof. Sundaram RVS
| |
అయితే, ఇవన్నీ జరగాలంటే మనం ఏ చెయ్యాలి, దాని కోసం ఎలాంటి కృషి చెయ్యాలి అని ఆలోచించాలి. 'కలలు కంటే ఏమవుతుంది' అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. 'కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా' అని సామెత. అసలు మనసులో ఉంటే కదా కలలైనా రావటానికి. మనసు పొరల్లో దాగి ఉండే కోరికలే కలల రూపంలో వస్తాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. అలాంటి కోరికలతో తెలుగు కలలు కంటేనే అవి ఎప్పటికైనా ఫలించే అవకాశం ఉంది.
తెలుగుజాతిని ఆకట్టుకొని, తెలుగుజాతి వోట్లు సంపాదించి, తెలుగు మాట్లాడే సామాన్య ప్రజల్ని మభ్యపెట్టి పాలకులైన వారు ఆ కోట్ల మంది ప్రజలకు వారి భాషలో విద్యను అందించకుండా, వారి భాషలో పరిపాలన చేయకుండా మోసం చేయటమంత ఘోరం మరొకటి లేదు. ఇటీవల ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే 'క్వాలిటీ ఎడ్యుకేషన్' ఇస్తామని చెప్పారు. చిరంజీవి మీద నాకు అంతరాంతరాలలో ఆశ ఉండేది. తనని ఇంత గొప్ప నాయకుడిగా చేసిన తెలుగు ప్రజలు మాట్లాడే భాషకు ఆయనైనా విలువిస్తాడనే ఆశ ఎక్కడో మినుకు మినుకుమనేది. కాని 'క్వాలిటీ ఎడ్యుకేషన్' అంటే ఇంగ్లీషు నేర్పించటమనే అర్థమే అయితే తెలుగు ప్రజల ఆశలన్నీ అడియాశలే అనిపిస్తోంది. తెలుగువారిని తెలుగులో తీర్చిదిద్దలేని చదువు, తెలుగు ద్వారా జ్ఞానం సంపాదించటానికి అవకాశం కల్పించని చదువు వ్యర్థం.
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు తెలుగు భాషకు, ప్రజలకు, సంస్కృతికి ద్రోహం చేసేవిగా ఉన్నాయనడంతో ఏమాత్రం సందేహం లేదు. పరిపాలనకు అవసరమైన పరీక్షల్లో తెలుగును తీసేసి ఇంగ్లీషులో వివిధ విషయాలను ప్రవేశపెట్టడం ద్వారా ఈ ప్రభుత్వానికి తెలుగువారిని పరిపాలించే అర్హత లేదని నిరూపించుకుంది. ప్రజా పరిపాలన, చరిత్ర, రాజనీతి, సాంస్కృతిక నేపథ్యం, సమాజశాస్త్రం లాంటివన్నీ తెలుగులోనే తెలుసుకొని పరీక్షలు రాయగలిగినవారే తెలుగువారిని పరిపాలించటానికి అర్హులు.
ఇంగ్లీషులో నేర్చుకోవటానికి, ఇంగ్లీషు నేర్చుకోవటానికి ఉన్న భేదాన్ని తెలుసుకోలేని అవివేకులు అధికారులు కావటం ఆంధ్రులు చేసుకున్న దురదృష్టం. తెలుగువారు అంతర్జాతీయ స్థాయిని పొందాలంటే ఇంగ్లీషు నేర్చుకోవాలి. కాని ఇంగ్లీషులో నేర్చుకోవలసిన అవసరం లేదని అధికారులకు ఎప్పటికి అర్థమవుతుందో!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|