|
|
Articles: TP Features | గుణపాఠం ఇంకెప్పుడు? - Prof. Sundaram RVS
| |
తెలుగులో పలికే ప్రతి మాటని సేకరించి సమగ్ర నిఘంటువుని నిర్మించినప్పుడే తెలుగు సత్తా ఏమిటో తెలుస్తుంది. అలాంటి నిఘంటువు వల్ల ఏ విషయాన్నయినా తెలుగులో రాయటానికి, అర్థం చేసుకోవటానికి అవకాశం లభిస్తుంది.
తెలుగువారంతా తమ సమస్యల్ని తెలుగులోనే తెలుపుకొని దానికి సమాధానాన్ని కూడా తమకు అర్థమయ్యే భాషలోనే లభించేట్లు పరిపాలన, న్యాయ నిర్వహణ, ప్రజావసరాలన్నిటి వ్యవహారం జరిగేట్లు చూడాలి.
తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, పురావస్తు శాస్త్రం, దర్శనాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఇతర దేశాలతో సంబంధాలు మొదలైన వాటి గురించిన సమగ్ర పరిశోధనకు అవకాశం కల్పించాలి.
ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉన్న తెలుగువాళ్ళందరి గురించీ సమగ్ర సమాచారాన్ని, భాషని, పలుకుబళ్ళని, సాహిత్యాన్ని సేకరించాలి.
ఈ సూచనలు జరగాల్సిన వాటిలో కొన్నిటిని గురించి మాత్రమే అని గమనించాలి. తెలుగును గూర్చిన కలలు సఫలం కావాలంటే సమగ్ర అవగాహన, తెలుగు స్పృహ, తెలుగు జాతిని గూర్చిన గౌరవం ఉండాలని మరోసారి గుర్తు చేసుకోవాలి.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|