|
|
Articles: TP Features | 'తెలుగు'పై పార్టీల ప్రేమ! - Site Administrator
| |
ఇక - ఇతర పార్టీల్లో భాషా విధానం విషయమై లోక్ సత్తాకు స్పష్టత ఉంది. తక్కిన పార్టీల్లో భారతీయ జనతా పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల విషయంలో ఇక్కడ పెద్దగా చెప్పుకోవలసిందేమీ లేదు. ప్రజల పట్ల బాధ్యత గల పార్టీలుగా వారు తెలుగు భాషోద్యమానికి సహకరిస్తూ, తోడు నడవగలిగితే చాలు. ప్రభుత్వాల్ని ప్రభావితం చెయ్యగలిగితే చాలు.
తెలుగు భాషోద్యమ సమాఖ్య మన రాజకీయ పార్టీలకు జాబులు రాసి, వాటి నాయకుల్ని నిరాహార దీక్షా శిబిరానికి ఆహ్వానించి, వారి వాగ్దానాల్ని విన్నది. ప్రజల్లోకి తనకు వీలైనంతగా వెళ్లింది. ఈ కృషిని కొనసాగిస్తూనే - తెలుగుభాషా సంస్కృతుల వికాసం కోసం, తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటాన్ని చేస్తూనే ఉండాలి.
అయితే, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే - ఈ పార్టీల్లో ఎవరిని ఎంచుకోవాలి? ఫలానా పార్టీకి, ఫనాలా అభ్యర్థికి ఓటు వెయ్యండని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. పార్టీల మేనిఫెస్టోలను దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థుల మంచిచెడ్డలనూ పరిశీలించి, తెలుగుభాష కోసం, తెలుగుజాతి కోసం నిలబడగలవారిని, పోరాడగలవారిని ఎంచుకొని ఓటు వెయ్యండి అని మాత్రం మేము చెప్పదలచుకొన్నాం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|