|
|
Articles: TP Features | తెలంగాణ - ఆత్మహత్యలు - Site Administrator
| |
తెలంగాణలోని సంక్షోభాలకు, ఇలాంటి ఈ చావులకు వెరసి బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస పోదామని బొంబాయి రైలు ఎక్కిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గల్ఫ్ బారిన పడిన వారు దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. వీరి జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. ఛిద్రం అయ్యాయి. అయినా వీరు ఆత్మహత్యలు చేసుకోకుండా జీవించడానికే ప్రయత్నించారు. ఒక ప్రాంతంలోని వారు తమ సాంస్కృతిక వారసత్వం, తమ నాగరికత ముగింపు దశకు (డెడ్ ఎండ్ కు) వచ్చిందని భావించినప్పుడు కూడా ఆ ప్రాంత ప్రజలు ఆత్మహత్యకు ఒడిగట్టడం సాధారణంగా జరుగుతుంది.
అన్ని రకాలుగా పరాయీకరణకు గురైన భావన లోంచి వచ్చిన నైరాశ్యం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నది మరో సూత్రీకరణ. ప్రపంచంలో ఇలాంటి రాజకీయ ఆత్మహత్యలు ఎక్కడా జరగలేదు. ఇవి నైజాం, తెలంగాణలోనే జరగడాన్ని సిద్ధాంత కర్తలు గుర్తించాలి. ఈ ఆత్మహత్యలు రాజకీయ హత్యల తర్వాతి అంకంగా జరుగుతున్నాయి. తెలంగాణ అస్తిత్వం కోసం జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిష్కరించి ఈ ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. వీటిపై శాస్త్రీయ అధ్యయనం జరిపి, ఆపే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, అంతర్జాతీయ సమాజంపై ఉంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|