కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట, July 19, 2025: కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ఆ కోరికను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
ఐదు వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ అధునాతన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది ఉత్పత్తి ప్రారంభించనుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు.
News Posted: 19 July, 2025
|