|  
  
  News:  వినోదం |  భారతీయుడు 3 త్వరలోనే స్టార్ట్ భారతీయుడు 3 సెట్స్ పైకి వెళ్లబోతోంది. అందుకు కారణం రజినీకాంత్ అంటోంది కోలీవుడ్. మరి ఆయన జోక్యం ఏంటో తెలియదు కానీ మొత్తంగా షూటింగ్ మాత్రం త్వరలోనే స్టార్ట్ కాబోతోంది.  
 
మొదటి షెడ్యూల్ లో ఓ పాటతో పాటు కొన్ని సీన్స్ ను చిత్రీకరిస్తారట. ఈ పార్ట్ కోసం దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట.  
 
ఈ పార్ట్ లో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. ఇప్పటికే మూడో భాగానికి సంబంధించి 70శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసి ఉన్నారు.  
 
అందుకే ఈ మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసి జనంపైకి వదలబోతున్నారు. మరి సెకండ్ పార్ట్ తో తిన్న షాక్ ను మూడో భాగం మరిపిస్తుందా కొనసాగిస్తుందా అనేది చూడాలి.
 
  
    News Posted: 19 July, 2025    
    
  |  
 |  
	
		
	 
	
		  | 
	 
	
		| 
			 (C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved. 
		 | 
	 
	
 
 |   
 |    |    |