|

 News: ప్రత్యేక కథనాలు | పత్రికలే సమాజానికి ప్రతిబింబం విశాఖపట్నం: పత్రికలే సమాజాన్ని ప్రతిబింబిస్తాయని సీనియర్ జర్నలిస్ట్ తెలుగు పీపుల్ డాట్ కామ్ బిజినెస్ ఎడిటర్ జి. జనార్ధన రావు అన్నారు. జాతీయ పత్రికాదినోత్సవం సందర్భంగా సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన "జర్నలిజం ఎథిక్స్" తీరుతెన్నులు గురించి మాట్లాడారు.

ఈ రోజు మీడియా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమైందన్నారు. ప్రభుత్వాలు పారదర్శకంగా పాలన చేయడంలో పత్రికలు కీలక బాధ్యత వహిస్తున్నాయన్నారు. మంచి పాలకుల్ని ప్రససిస్తున్నాయి. అవినీతి పాలకుల్ని ప్రజల ముందు, న్యాయస్థానాల ముందు నిలుపుతున్నాయని ఆయన అన్నారు. ప్రత్యేకించి జర్నలిజం విద్యార్థులు ఇప్పటి నుంచే ఎథిక్స్ అలవర్చుకోవాలన్నారు.
చోటు చేసుకుంటున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని కెరీర్ నిర్మించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమానికి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పేటేటి ప్రేమానందం అధ్యక్షత వహించారు. ఫ్యాకల్టీ, రిసెర్చి స్కాలర్స్, విద్యార్థులు, స్టాఫ్ పాల్గొన్నారు.
|
|
 |
|
(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.
|
|
| | |