|
|
Articles: TP Features | గ్రహణాన్ని చూడొచ్చు - Site Administrator
| |
డా.వంగల రామకృష్ణ
ఆకాశంలో గ్రహణం వస్తోందంటే చాలా మందికి భయం. ఆరోగ్యాలు చెడతాయని, కంటి చూపు దెబ్బతింటుందని, గర్భం ధరించినవారు చూస్తే పిల్లలకు గ్రహణం మొర్రి వస్తుందని నానారకాల నమ్మకాలు, మూఢనమ్మకాలు వ్యాపించి ఉన్నాయి. గ్రహణం పట్టిన సూర్యుని నేరుగా మన కళ్ళతో చూడరాదని, గాజుముక్కకు బాగా మసి పట్టి దాని ద్వారా చూడాలని చెబుతారు. ఎక్స్ పోజ్ చేసిన ఫొటోఫిల్మ్ ద్వారా కూడా చూడవచ్చునంటారు. అంతేకాదు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నవి సిడిలు, వాడేసి పనికిరాకుండా ఉన్న సీడీని ఓపెన్ చేస్తే అందులో ఎక్స్ పోజ్ అయిన ఫిల్మ్ ఉంటుంది. దాని ద్వారా చూసినా ఇబ్బంది ఉండదంటారు. వీలైనంతవరకు గ్రహణ సమయంలో బైటికి రాకుండా కృష్ణారామా అనుకుంటూ ఇంట్లో ఉండడమే మేలని చెబుతారు. ఇవన్నీ నిన్నటి మాటలని ఆధినుకులు కొట్టివేస్తున్నారు. గ్రహణం పట్టే సూర్యుడు ఎంతో అందంగా ఉంటాడని, అందునా ఆ గ్రహణం సంపూర్ణమైనదైతే సూర్యుడిలోని అందాలు మరింతగా ద్విగుణీకృతమై కనబడతాయని చెబుతున్నారు.
గ్రహణం పరిపూర్ణమవుతున్న సమయంలో సూర్యుడు వజ్రాల ఉంగరంలా మహా అందంగా కనబడతాడని, వెలుగులో ఉంటే సహజ వర్ణాలు విశ్వవ్యాప్తమై కనువిందు చేస్తాయని చెబుతారు. అతి అరుదైన, అపూర్వమైన, అందమైన ప్రకృతీ సహజమైన సన్నివేశాన్ని లేనిపోని అపోహలతో దూరం చేసుకోవద్దని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. సూర్యునిలోని కిరణాలు, వేడి మందగించి ఉండే సమయం కనుక ఆ సమయంలో ఆగ్రహణం గురించి మరింతలోతుగా అధ్యయనం చేసేందుకు వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కంటిపై సూటైన, చురకైన సూర్యకిరణాల వల్ల ప్రభావం ఉండే మాట నిజమే అయినా అందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ అద్భుతాన్ని చూసే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చునని వారు చెబుతున్నారు.
| Read 4 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|