కాంతారావు మధురస్మృతులు
కత్తి కాంతారావు
కాంతారావు పౌరాణిక, జానపద చిత్రాలతో పాటు సాంఘిక చిత్రాలతోనూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. రాముడుగా, కృష్ణుడుగా, శ్రీమహావిష్ణువుగా, శివుడుగా, నారదుడుగా ఎన్నో పాత్రలు పోషించి మెప్పించారు. 'భక్త మార్కండేయ', 'రామాంజనేయ యుద్ధం', 'గౌరీమహాత్మ్యం' వంటి చిత్రాల్లో ఆయన శివడుగా నటించారు. ఇక నారదుడి పాత్ర ఆయన మినహా మరెవరూ అంత గొప్పగా నటించి మెప్పిచలేరనే పేరు తెచ్చుకున్నారు. 'గంగా గౌరీ సంవాదం', 'సీతారమ కల్యాణం', 'మోహిని రుక్మాంగద', 'శ్రీకృష్ణ తులాభారం' వంటి చిత్రాల్లో ఆయన నారదుడి పాత్రల్లో నటించారు. భక్త అంబరీషుడు, భక్త రఘునాథ్, రాముడు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మణుడు వంటి పాత్రల్లోనూ తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే జానపద కథానాయుకుడుగా తిరుగులేని పేరు ఆయన సొతం. 'కత్తివీరుడు' గా జనం హృదయంలో పదిలంగా నిలిచిపోయారు. జయవిజయ, గురువును మించిన శిష్యుడు, సింహాచల క్షేత్ర మహిమ, కనకదుర్గ పూజా మహిమ, ప్రతిజ్ఞాపాలన, బంగారు తిమ్మరాజు, మహాబలుడు, రణభేరి, గండరగండడు, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి వంటి చిత్రాలెన్నో శతదినోత్సవాలు జరుపుకొన్నాయి. జానపత బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యధిక చిత్రాల్లో నటించిన కథానాయకుడు ఆయన. కాంతారావుకు జోడిగా 28 సినిమాల్లో నటించిన క్రెడిట్ కృష్ణకుమారికి దక్కుతుంది. కాంతారావు నటించిన సాంఘిక చి్తరాల్లో 'ఆనంద నిలయం', 'శాంతినిలయం', 'కానిస్టేబుల్ కూతురు', 'దేవుడు చేసిన మనుషులు', 'ఓ సీతకథ', 'వంశవృక్షం', 'ముత్యాల ముగ్గు', వంటి చిత్రాలెన్నో ఆయనకు మంచిపేరు తెచ్చాయి.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|