కాంతారావు మధురస్మృతులు
మరికొన్ని అవార్డులు...
ఎన్టీఆర్ 'లవకుశ' చిత్రంలో లక్ష్మణుడి పాత్రకు గాను అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. మలయాళ 'కుచేల' చిత్రం ద్వారా అప్పటి కేరళ గవర్నర్ వి.వి.గిరి నుంచి అవార్డు అందుకున్నారు. చంద్రబాబు చేతులమీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నరు. ఇక నాగయ్య, ఎస్వీ రంగారావు పేరిట పలు సాంస్కృతిక సంస్థల అవార్డులు కూడా ఆయన్ని వరించారు. వ్యక్తిగతంగా కూడా కాంతారావులో సెంటిమెంట్ల మెండు. తొలిచిత్రం 'ప్రతిజ్ఞ' లోని తన పాత్ర పేరు ప్రతాప్ కావడంతో ఆ పేరునే తన కుమారడికి పెట్టారు. రెండో కుమారిడి తన తండ్రి పేరు 'కేశవరావు' అనే నామకరణం చేశారు. తన భార్య గుర్చొచ్చేలా కుమార్తెకు సుశీల అనే పేరు పెట్టుకున్నారు. నటుడిగా, పరిపూర్ణ వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచిన కాంతారావును కేన్సర్ మహమ్మారి కబళించకకుంటే ఆయన మరికొంత కాలం మనమధ్య ఉండి మరింత గౌరవ మన్ననలు పొందుండే వారు. పుట్టిన ప్రతిజీవీ గిట్టక మానదని గీతాచర్యుడు చెప్పినట్టు కాంతారావు సుదీర్ఘమైన సెలవు తీసుకున్నారు. తెలుగు సినిమా ఉన్నంతవరకూ, జానపద కథానాయకుడిగా ఆయన సంపాదించుకున్న పేరు, ఆయన జ్ఞాపకాల అభిమానుల హృదయాల్లో పదిలంగానే ఉంటాయి.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|