కాంతారావు మధురస్మృతులు
అభిరుచి గల నిర్మాత
మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా 'సప్తస్వారాలు', 'గండర గండడు', 'ప్రేమజీవులు', 'గుండెలు తీసిన మొనగాడు', 'స్వాతి చినుకులు' వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్న దిశలో ఆయన తీసిన 'స్వాతి చినుకులు' ఆయనకు మరో
చేదు అనుభవాన్ని మిగిల్చింది. సినిమా ఫెయిలయినా నంది అవార్డును గెలుచుకోవడం ఓ ఊరట. జీవన మనుగడ కోసం టీవీ సీరియల్స్ లోనూ అడపాదడపా నటించారు. నటుడిగా ఆయన చిరంజీవి హీరోగా నటించిన 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రంలో చివరి సారిగా కనిపించారు.
అపూర్వ సన్మానం
ఎందరో కళాకారులకు సన్మానాలు జరిగిన కాంతారావుకు నటప్రపూర్ణ పేరుతో అప్పట్లో హైద్రాబాద్ లో జరిగిన సన్మానం నభూతో నభవిష్యతిగా చెప్పాలి. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు తనయుడు పి.వి.రంగారావు ఆధ్వర్వంలోని 'పంచశీల' సంస్థ ద్వారా ఆయనకు రవీంద్రభారతిలో 'నటప్రపూర్ణ' బిరుదుతో సత్కారం జరిగింది. అంతకుముందు కోఠి సుల్తాన్ బజార్ నుంచి రవీంద్ర భారతి వరకూ జరిగిన ఊరేగింపు వాహనంలో ఆయన ధర్మపత్ని హైమావతి, కాంతారావు చిత్రాల హీరోయిన్ రాజశ్రీ తో కలిసి పురవీధుల గుండా పయనిస్తున్నప్పుడు అశేష జనవాహిని వెన్నెంటి వచ్చింది. హైలికాఫ్టర్ నుంచి పూలవర్షం కురిసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అపూర్వ సన్మానంగా చెబుతారు. రాష్ట్రప్రభుత్వం ఆయనను కళాప్రపూర్ణ, రఘుపతి వెంకయ్య అవార్డులతో సత్కరించింది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|