సత్య (నాగ చైతన్య) ఓ యంగ్ డైనమిక్ విద్యార్థి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంటాడు. ఒకరోజు తాను చదవు మానేస్తున్నాననీ, హైద్రాబాద్ వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటాననీ తల్లిదండ్రులకు చెప్పి హైద్రాబాద్ ప్రయాణమవుతాడు. మామయ్య (సునీల్) దగ్గర ఉంటూ ఓ నర్సరీలో ఉద్యోగం సంపాదించుకుంటాడు. అక్కడ నిత్య (కార్తీక) పరిచయమవుతుంది. నిత్యకు కాలేజీ చదవాలని ఉన్నా అన్నయ్యకు ఇష్టం లేకపోవడంతో కాన్వెంట్ లో టీచర్ గా పనిచేస్తుంటుంది. కార్తీక అన్నయ్య ఎంజిఎం కాలేజీలో క్యాంటీన్ నడుపుతుంటాడు. ఎంజిఎం కాలేజీలో రౌడీ స్టూటెంట్ల గ్యాంగ్ లు ఎక్కువ. ఆ కాలేజీ వాతావరణం కలుషితం కావడం సత్య గుర్తిస్తాడు. అదే కాలేజీ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి నాయకుడు జె.ధర్మరావు అలియాస్ జె.డి (జె.డి.చక్రవర్తి) తన స్వప్రయోజనాల కోసం స్టూడెంట్ గ్యాంగ్ లను ఉపయోగించుకుని వారి అరాచకాలకు వంత పాడుతుంటాడు. జె.డి. ఆదేశంతో స్టూడెంట్ గ్యాంగ్ నగరంలో స్టూడెంట్ బ్యాచ్ లు విధ్వసం సృష్టించడంతో ఆ సంఘటనకు సత్య ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు. దాంతో అతనికి జె.డి.తో వైరం మొదలవుతుంది. విద్యార్థులలో మార్పు తేవాలంటే వారి సహ విద్యార్థి కావడమే సరైన మార్గంగా భావించిన సత్య ఎంజిఎం కాలేజీలో స్టూడెంట్ గా అడుగుపెడతాడు. అతని ఆశయం ఏ విధంగా నెరవేరింది? విద్యార్థులలో మార్పు కోసం అతన్ని ప్రేరేపించిన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అనేది మిగతా కథ.