'జోష్' రివ్యూ
దర్శకుడు వాసువర్మ తను అనుకున్న కథను అనుకున్న విధంగా ఎలాంటి మెలికలు లేకుండా సాఫీగా నడపారు. కాకుంటే ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం ఎంచుకున్నారు. ఎక్కడా స్టార్ తనయుడితో చేస్తున్నాననే ఫీలింగ్ మనసులో పెట్టుకోకుండా తాను అనుకున్న రీతిలో కథను తెరకెక్కించడం స్పష్టంగా కనిపిస్తుంది. కథలో సందేశాలు బాగానే ఉన్నా యూత్ 'నాడి' తెలుసున్నందువల్లనే ఏమో కానీ'నాకు మామూలుగా మెసేజ్ లు ఇవ్వడం ఇష్టం ఉండదు. నీకు ఏమైనా ఇచ్చాను అనిపిస్తే తీసుకో' అంటూ కథానాయకుడి చేత ఓ డైలాగ్ మొదట్లోనే చెప్పించడం దర్శకుడి చతురతనే చాటుతుంది. 'శివ' చిత్రం ఛాయలు అడపాదడపా కనిపించినప్పటికీ కథ నడక మాత్రం భిన్నంగా ఉండేలా ఆయన చూసుకున్నారు. అలాగే ఎక్కడా నాగార్జున పేరు కానీ, ఆయనను గుర్తుచేసే సంభాషణలు గానీ లేకుండా నాగచైతన్య కు సొంత ఐటెంటిటీ ఇవ్వాలనుకోవడం అభినందనీయం.
నాగచైతన్య ముఖంలో లేతదనంతో పాటు సహజసిద్ధమైన ఫైర్ కొట్టిచొచ్చినట్టు కనిపిస్తుంది. పోలికలు, నడక నాగార్జునను బాగా గుర్తు చేస్తాయి. అలాగే ఫైట్స్, డాన్సులలో మంచి ఈజ్ చూపారు. నాగార్జున పోలికల వల్లనే ఏమో కానీ ఒకటి రెండు సన్నివేశాల తర్వాత ఓ కొత్త హీరోని చూస్తున్న అనుభూతి కలగదు. బాగా పరిచయమున్న నటుడ్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కాకుంటే వాచికం, హావభావాల విషయంలో మెరుగు పరచుకోవాల్సింది చాలా ఉంది. జె.డి., ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ యాక్టర్ల ముందు కూడా నదురూబెదురూ లేకుండా ఆలోవకగా నటించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాల్టి యువహీరోలకు మునుముందు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. కార్తీకలో తన తల్లి రాధ పోలికలు కనిపించడం, పొడగరి కావడం ఓ అడ్వాంటేజ్. మేకప్ అతిగా అనిపించి సహజమైన గ్లామర్ ను చాలాచోట్ల మరుగున పడింది. టీచర్ అంటే కోప్పడటం...కాలేజీ స్టూడెంట్ లా ఉందంటే పొంగిపోవడం వంటి కామెడీ టచప్ ఉన్న సన్నివేశాలు బాగా చేసింది. నాగార్జున 'శివ' చిత్రంలో విలన్ గా పరిచయమైన జె.డి. ఇప్పుడు ఆయన తనయుడు నాగచైత్య తొలిచిత్రంలోనూ ప్రతినాయకుడుగా నటించడం ఆసక్తి కలిగించే అంశం. మేకవన్నె పులి వండి స్టూడెంట్ లీడర్ గా జె.డి. తన పాత్రకు న్యాయం చేశారు. తక్కిన పాత్రల్లో ప్రకాష్ రాజ్ నటించిన ప్రిన్సిపాల్ పాత్ర కు మళ్లీ మంచి ప్రశంసలు దక్కుతాయి. తన కొడుకు చనిపోయినప్పుడు ఆయన చేసిన అభినయం ప్రశంసార్హం. జె.డి. అసిస్టెంట్ పాత్రలో బ్రహ్మానందం శుద్ధ వేస్టు. ఒక్కసారి కూడా నవ్వించిన పాపాన పోలేదు. ఆ బాధ్యతను సునీల్ చక్కగా నెరవేర్చారు.
Read 4 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|