'జోష్' రివ్యూ
సాంకేతకపరంగా సమీర్ రెడ్డి కెమెరా వర్క్ మెచ్చుకోలుగా ఉంది. సందీప్ చౌతా సంగీతం, బ్యాడ్ గ్రౌండ్ మ్యూజిక్ ఫరవాలేదు. ఆయన సంగీతం అందించిన పాటల్లో 'నీతో ఉంటే ఇంకా కొన్నాళ్లు' పాట సాహిత్య ప్రధానంగానూ, చిత్రీకరణ పరంగానూ బాగుంది. 'ఐ యామ్ ఎ బ్యాడ్ బోయ్' హుషారు గొలుపుతుంది. వాసువర్మ సంభాషణల్లో 'గాంధీజీ, మదర్ థెరిస్సా, సుభాష్ చంద్రబోస్ వంటి వాళ్లు అంత గొప్పవారయ్యారంటే కారణం...వారిమీద ఎవరి ఒత్తిడీ లేదు కాబట్టి', 'గుడ్డో బ్యాడో నాకు బ్యాచ్ లు గిట్టవు' వంటి సంభాషణలు సందర్భోచితంగా ఉన్నాయి. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ లో ఒకటి రెండు చోట్ల జంపింగ్ లు కనిపిస్తాయి. కాస్ట్యూమ్స్, ఫైట్స్, దిల్ రాజు నిర్మాణ విలువలు కూడా తగినట్టుగానే ఉన్నాయి.
దిల్ రాజు నుంచి ఎక్కువగా యూత్ ఫుల్ చిత్రాలు రావడంతో సహజంగానే 'జోష్'ను ఆ తరహా చిత్రంగానే ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేస్తారు. అయితే ఇందులో సందేశాల మోతాదు ఒకింత ఎక్కువై 'జోష్' పాళ్లు తగ్గాయి. కామెడీ, హీరోహీరోయిన్ల మధ్య సరైన రొమాంటిక్ ట్రాక్ లేకపోవడం నిరాశపరచే అంశాలు. ఏదిఏమైనా నాగచైతన్య తొలిచిత్రం కావడం, దిల్ రాజు బ్యానర్ వాల్యూ యూత్ ను థియేటర్ల వైపు అట్రాక్ట్ చేస్తుంది. బాక్సాఫీస్ ఫలితం సైతం వీరిపైనే ఆధారపడి ఉంటుంది.
Read 4 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|