'మహాత్మ' రివ్యూ
ఇవాల్టి రాజకీయాలకు మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ముడిపెట్టి కృష్ణవంశీ ఈ కథాంశాన్ని ఎంచుకున్నారు. భరతజాతి గర్వించదగిన మహనీయులు, పవిత్ర ప్రాంతాలను 'తలఎత్తి జీవించు తమ్ముడా' అనే టైటిల్ సాంగ్ లో చూపించడం ద్వారా కథలోకి ప్రేక్షకులను ఇన్ వాల్వ్ చేసే ప్రయత్నం మెచ్చుకోలుగా ఉంది. గాంధీ జయంతి రోజున ఆయన విగ్రహానికి జెండాలు ఎగురవేయాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న సమయంలో వారిని రౌడీయిజంతో శ్రీకాంత్ అడ్డుకునే సన్నివేశం, అలాగే గాంధేయవాదానికి కట్టుబడి రౌడీల చేతిలో తీవ్రంగా గాయపడి గాంధీ విగ్రహం ముందు రక్తం చిందించే ఘట్టం, తన కాలనీవాసుల కోసం ఆత్మహత్యాయత్నం చేసే ఘట్టం దర్శకుడు ఉద్విగ్నభరితంగా చిత్రీకరించారు. ఇప్పుడు సినిమా వాళ్లెవరున్నారు? అంతా రాజకీయాల్లోకి వెళ్లిపోయారంటూ అడపాదడపా సెటైర్లు విసిరారు. రాజకీయాల్లో టిక్కెట్లు కావాలంటే కులం బలం...మాఫియా పనులు...హత్యలు...పదవుల్లో ఉన్న పొల్టీషియన్ల పలుకుబడి ఉండాలనీ...ఇవేవీ లేకపోతే ఓపెన్ లో టక్కెట్లు అమ్ముకోవడానికి కూడా సిద్ధమంటూ ఓ పార్టీ పరిశీలకుడి (ఆహుతి ప్రసాద్) పాత్ర ద్వారా చెప్పించడం ఇవాల్టి నిస్సిగ్గు రాజకీయాలకు మ(మె)చ్చుతునక.
రౌడీ స్థాయి నుంచి గాంధీ ఆశయం కోసం మార్పు చెందిన వ్యక్తిగా శ్రీకాంత్ ఎంతో బాధ్యతగా నటించారు. అతను పడిన కష్టం చాలా సందర్భాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నటుడిగా ఆయన గర్వించదగిన పాత్ర చేశారు. 'కస్తూరిబా'లా కథానాయకుడికి ఉత్రేరకం అందించే పాత్రలో భావన ఫరవాలేదు. అయితే ఆ పాత్రకు గ్లామర్ అప్పీల్ లేకపోవడం మాస్ ను నిరాశ పరచే అంశం. నిజమైన పొలిటీషియన్ తరహాలో జయప్రకాష్ రెడ్డి విజృంభించి నటించారు. ఆయన కెరీర్ లో ఇదో మంచి పాత్ర అవుతుంది. సినిమాలోని పాత్రలన్నింటిలోనూ రామ్ జగన్ పాత్రకు ఉన్న ప్రత్యేకత మెచ్చుకోకుండా ఉండాలి. కమెడియన్ పాత్రలు ఎక్కువగా పోషించే రామ్ జగన్ ఇందులో దేశభక్తి భావాలున్న వ్యక్తిగా అలనాటి మహనీయులైన టంగుటూరి, పొట్టి శ్రీరాములు, పింగళి వెంకయ్య, అల్లూరి గెటప్ లలో మంచి నటన ప్రదర్శించారు. ముఖ్యంగా గాంధీ గెటప్ లో ఆయనను చూపించిన తీరు అబ్బుర పరుస్తుంది. ఆయనకు వచ్చిన ఈ అవకాశం చూస్తే కళాకారుడిగా పుట్టడం ఓ వరమని అనిపిస్తుంది. రైఫిల్ పోయిందని చెప్పి సస్పెన్షన్ కు గురై శ్రీకాంత్ కు సహకరించే కానిస్టేబుల్ పాత్రలో పరుచూరి వెంకటేశ్వరరావు సహజ నటనను ప్రదర్శించారు. శ్రీకాంత్ ఫ్రెండ్ గా ఉత్తేజ్ కూడా బాగా చేశాడు. బ్రహ్మానందం ఓ సన్నివేశంలో కనిపించినా సినిమాకి ఒరిగేదేమీ లేదు. ఆహుతి ప్రసాద్, జ్యోతి, శేఖర్ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఛార్మి ఓ ఐటెం సాంగ్ లో కనిపించే, మరో సాంగ్ లో నవనీత్ కౌర్ నర్తించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|