'మహాత్మ' రివ్యూ
సాంకేతిక పరంగా శరత్ సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. విజయ్ ఆంటోని సంగీతం అందించిన పాటల్లో 'డైలెమ్మో', 'జజ్జనక జజ్జనక' పాటలు ఆయన తమిళంలో చేసిన ట్యూన్సే కావడం విశేషం. 'నీలంపురి గాజల నీలవేణి' అనే తెలంగాణ ఫోక్ సాంగ్ కూడా ఉంది. సిరివెన్నెల రాసిన 'ఇందిర ఇంటిపేరు కాదుర గాంధీ' పాట సెన్సార్ మార్పు వల్ల 'కొంత మంది సొంతపేరు కాదుర గాంధీ'గా రూపాంతరం చెందింది. చక్కిటి సాహిత్యం, చిత్రీకరణతో ఈ పాట ఆకట్టుకుంటుంది. పరుచూరి బ్రదర్శ్ సంభాషణల్లో దట్టింపు ఫరవాలేదు. 'పబ్లిక్ ను మోసం చేయడమే పాలిటిక్స్', 'నువ్వు సిఎం అయితే నేను డిజిపి...పిఎం అయితే నేను డిఫెన్స్ మినిస్టర్', 'కేస్ట్ ను నమ్ముకోవడం కంటే వేస్ట్ ను నమ్ముకోవడం మంచిది. కనీసం కరెంటైనా పుడుతుంది', 'ఫ్రీ అంటేనూ జనం లైన్ లో ఉంటారు...ఓట్లు వేయడానికీ క్యూలో ఉంటారు' వంటి సంభాషణలు సందర్భోచితంగా ఉన్నాయి. అయితే సెన్సార్ వారు ఇందులో జ్యోతి పలికిన 'ఫ...ఆఫ్' అనే పదాన్ని పట్టించుకోలేదు. సి.ఆర్.మనోహర్ నిర్మాణ విలువలూ, ఆయన అభిరుచి మెచ్చుకోలుగా ఉన్నాయి.
సినిమా ఎత్తుగడ బాగున్నప్పటికీ అసలు కథ ఎంటరయ్యేది విశ్రాంతికి ముందే. ద్వితీయార్థంలోని పలు సన్నివేశాలు గ్రిప్పింగ్ గా ఉన్నప్పటికీ క్లైమాక్స్ ఊహించగలిగే రీతిలోనే సాగింది. శ్రీకాంత్, జయప్రకాష్ రెడ్డి నటన, రామ్ జగన్ పాత్ర మలిచిన తీరు, టైటిల్ సాంగ్ సినిమాకి దన్నుగా నిలుస్తాయి. ఓవరాల్ గా...జనం మరిచిపోతున్న సత్యం, అహింస, ప్రస్తుత పరిస్థితుల్లో వాటి అవసరం ఏమిటనేది తెలుసుకునేందుకైనా 'మహాత్మ'ను చూడొచ్చు.

Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- -3- 4
|