'జయీభవ' రివ్యూ
విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న రామ్ (కల్యాణ్ రామ్) ఇండియాకు తిరిగి వస్తాడు. అయితే రామ్ తన బాటలో నడవకుండా చదవిన చదువుకు ఏదైనా ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటే మంచిదని తండ్రి భవనీ శంకర్ (ముఖేష్ రుషి) సలహా ఇస్తాడు. భవానీ శంకర్ జనం మేలు కోరుకునే వ్యక్తి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. అతనికి ప్రధాన శత్రువు నర్సింహ (జయప్రకాష్ రెడ్డి). ఇద్దరూ తమ ఏరియాల్లో గ్యాంగ్ లు మెయింటన్ చేస్తుంటారు. పూర్వాశ్రమంలో వీరిద్దరి మధ్యా ఉన్న మిత్రత్వాన్ని శత్రుత్వంగా మార్చిన యాదవ్ (ఆశిష్ విద్యార్థి) హాంగ్ కాంగ్ లో క్రికెట్ బెట్టింగ్ మాఫియా నడుపుతుంటాడు. అక్కడ్నించే నర్సింహతో డీలింగ్స్ జరుపుతుంటాడు. రామ్ ఇండియాకు వచ్చిన తరుణంలో నర్సింహ మనిషి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో తన తండ్రికి చెప్పకుండా రామ్ వెళ్లి ఆ వ్యక్తిని విడిపిస్తాడు. దాంతో భవానీకి నర్సింహ హెచ్చరికలు చేస్తాడు. ఈ ఇద్దరి మధ్యా శత్రుత్వానికి మూలం హాంగ్ కాంగ్ లో యాదవ్ రూపంలో ఉందని తెలుసుకున్న రామ్ అతని ఆట కట్టించేందుకు అక్కడకు బయలుదేరుతాడు. ఇండియా నుంచి చదువుల కోసం అక్కడు వచ్చిన అంజలి (హన్సిక) అతనికి పరిచయమవుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలోనే అంజలి మరెవరో కాదనీ, నర్సింహ కుమార్తె అని రామ్ తెలుసుకుంటాడు. తమ తండ్రుల మధ్య వైరాన్ని తమ వివాహంతో బంధుత్వంగా మార్చాలనుకున్న ఆ ప్రేమ జంట అందుకు ఏమి చేసింది? వారి ప్రయత్నం ఫలించిందా? యాదవ్ ఆట ఎలా కట్టిందనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|