'జయీభవ' రివ్యూ
'జయీభవ' అనే నటరత్న ఎన్టీఆర్ ఓల్డ్ సాంగ్ బిట్ తో టైటిల్ కార్డ్స్ వేసిన దర్శకుడు ఆ తర్వాత ఒక పేలవమైన ఛేజ్ తో కథను ప్రారంభించడం కన్విన్సింగ్ గా లేదు. ఒకవైపు ప్రభుత్వ ఆస్తి వేలం జరుగుతుంటే తమలో ఒకరిగా ఉంటూ మోసం చేసిన వ్యక్తిని ఛేజ్ చేసి నరికిచంపడానికే నర్సింహ పరిమితమై...తన ప్రత్యర్థి ఆ బిడ్ ఎగరేసుకుని పోయిన తర్వాతే అక్కడికి చేరుకోవడం రీజన్ కు అందదు. క్లైమాక్స్ లో నూ ఇలాంటి గందరగోళం ఉంది. ఎక్కడో హాంగ్ కాంగ్ లో పోలీసులకు పట్టుబడిన యాదవ్ చివర్లో హీరోహీరోయిన్ల నిశ్చితార్ధం టైమ్ కి పదిమంది అనుచరులతో ల్యాండ్ అయిపోతాడు. చట్టాలు అతనికి చుట్టమని అనుకోవాలా? అదే నిజమైతే ఆ విషయాన్నే దర్శకుడు చూపించి ఉండొచ్చు. అయితే కల్యాణ్ రామ్ కు ఉన్న మాస్ ఇమేజ్ ను ఎంటర్ టైన్ మెంట్ బాట పట్టించడంలో దర్శకుడి నేర్పు కనిపిస్తుంది. నా కొడుకుకు మీ పేరే పెట్టుకుంటానని కల్యాణ్ రామ్ ఆశచూపించినప్పుడల్లా ఆలీ, బ్రహ్మానందం తలచుట్టూ చక్రాలు తిరగడం ఆడియెన్స్ లో నవ్వుల సందడి సృష్టిస్తోంది.
కల్యాణ్ రామ్ బ్యాలెన్స్ డ్ గా నటించారు. ఆయనలో గత చిత్రాల మాదిరిగా కాకుండా క్లాస్ అప్పీల్ ఎక్కువగా కనిపించింది. సునాయాసంగానే తన పాత్రను పోషించారు. హన్సిక మోడ్రన్ గాళ్ గా ఆల్ట్రా మోడ్రన్ దుస్తుల్లోనూ, సాంప్రదాయ యువతిగా చీరకట్టుతో క్యూట్ గా అనిపించింది. నటనకు కూడా కొద్దిపాటి అవకాశం చిక్కింది. ముఖేష్ రుషి, జయప్రకాష్ రెడ్డి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆశిష్ విద్యార్థి రొటీన్ టైప్ విలనీ ప్రదర్శించారు. సినిమాకి వెన్నెముకగా నిలిచిన క్రెడిట్ హాస్యనటులకే దక్కుతుంది. జయప్రకాష్ రెడ్డి బావమరిది టైగర్ పాండుగా రఘబాబు, డ్రైవర్ బాలుగా ఆలీ మంచి కామెడీ పండించారు. పురోహితుడు లక్ష్మీనరసింహ శాస్త్రిగా బ్రహ్మానందం చివరి 20 నిమిషాలు తనదైన స్టైల్ లో కామెడీ పండించారు. హేమ కామెడీ సందడి కూడా ఓకే. ఎటొచ్చీ వేణుమాధవ్ కామెడీ పండలేదు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|