'జయీభవ' రివ్యూ
సాంకేతికపరంగా దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పాటలు రిచ్ గా తెరకెక్కించారు. థమన్ ఎస్ సంగీతం కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటల్లో 'వేర్ ఎవర్ యు గో నీతోవస్తా' పాటకు చక్కటి యానిమేషన్ కుదిరింది. 'బొబ్బిలిరాజా'లోని సాంగ్ ను తలపించింది. బి.వి.ఎస్.రవి సంభాషణల్లో తగినింత పంచ్ లోపించింది. 'హీరోయిజం అనుకుంటే వచ్చేది కాదు..బ్లడ్ లో ఉండాలి'అనే ఒకటి రెండు డైలాగ్స్ లోనే కొద్దిపాటి పంచ్ కనిపిస్తుంది. కళాదర్శకుడు రాజీవ్ నాయర్, ఎడిటర్ గౌతంరాజు తమ బాధ్యతలను బాగానే నెరవేర్చారు. కల్యాణ్ రామ్ నిర్మాణ విలువలు మెచ్చుకోలుగా ఉన్నాయి.
సినిమా ప్రథమార్థం కొద్దిపాటి యాక్షన్, హీరోహీరోయిన్ల రొమాన్స్ వంటి ఆంశాలతో సాదాసీదా నడక సాగించింది. వినోదానికి ఆస్కారం అంతగా లేదు. విశ్రాంతి ట్విస్ట్ చాలా సినిమాల్లో చూసిందే. అయితే ద్వితీయార్థం దర్శకుడు పట్టు బిగించారు. దాదాపు నాన్ స్టాప్ కామెడీ తో కథ నడిపించారు. సినిమాకి ఆయువుపట్టు కూడా ద్వితీయార్థమే. బాగా నలిగిన స్టోరీ లైన్ అయినప్పటికీ దర్శకుడు ఇచ్చిన 'వినోదం' కోటింగ్ ఫ్యామిలీ స్టోరీ లుక్ ను ఇచ్చింది. ఓవరాల్ గా 'జయీభవ' చిత్రానికి పాక్షిక జయం దక్కుతుంది.

Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|