'కుర్రాడు' రివ్యూ
వరుణ్ (వరుణ్ సందేష్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. డిగ్రీ పూర్తి చేసిన వరుణ్ కి జీవితంలో ఓ బైక్ ను సొంతం చేసుకోవాలనే బలమైన కోరిక ఉంటుంది. అయితే బైక్ కొనిపెట్టేందుకు తగిన స్థోమత అతని తండ్రికి (తనికెళ్ల భరణి) ఉండదు. ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్న కొడుకుని మందలిస్తుంటాడు. ఒకసారి ఇద్దరి మధ్యా మాటామాటా పెరుగుతుంది. దీంతో కూతురు కోసం దాచిపెట్టిన 70,000 రూపాయలను అతని తండ్రి వరుణ్ చేతిలో పెడతాడు. వరుణ్ ఆ సొమ్ముతో ఎరుపు రంగు టీవీఎస్ అపాచీ బైక్ కొనుక్కొంటాడు. ఆ బైక్ వచ్చిన వేళా విశేషంతో రెండేళ్లుగా అతను ఇష్టపడుతున్న గాళ్ ఫ్రెండ్ హేమ (నేహాశర్మ) అతని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఓ బ్యాంకులో లోన్ రికవరీ ఏజెంట్ ఉద్యోగం కూడా వస్తుంది. కొడుకు ప్రయోజకుడయ్యాని కుటుంబం అంతా సంతోషంగా ఉంటున్న తరుణంలో వరుణ్ బైక్ మాయమమవుతుంది. జీవితంలో అందివచ్చిన ఉద్యోగం, గాళ్ ఫ్రెండ్ వంటివన్నీ జారిపోయే పరిస్థితి తలెత్తుతుంది. బైక్ వెతుకులాటలో భాగంగా కరడుగట్టిన డాన్ సత్య (రవిశంకర్) తమ్ముడు రవితో వరుణ్ తలపడతాడు. ఆ ముఠాకూ బైక్ దొంగతనానికీ సంబంధం ఏమిటి? చివరకు తన జీవితంలో చేజారిన వాటిని వరుణ్ తిరిగి ఎలా సంపాదిచ్చుకున్నాడనేది మిగతా కథ.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|