సాంకేతికపరంగా సర్వేష్ మురారీ ఫోటోగ్రఫీ నీట్ గా ఉంది. అచూ సంగీతం అందించిన పాటల్లో 'కుర్రాళ్లోయే కుర్రాళ్లు' రీమిక్స్ సాంగ్స్ యూత్ ఫుల్ గా ఉంది. కోటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. 'మార్కెట్లో కందిపప్పు..ఇచ్చిన అప్పు అంత తేలిగ్గా దొరకవు', 'లైన్ వేశావు కదా లైన్ లోనే ఉన్నాను' (హీరోతో ఫోన్ లో హీరోయిన్) వంటి సంభాషణలు బాగున్నాయి. ఆనంది ఆర్ట్స్ జి.కిరణ్ నిర్మాణ విలువలు కూడా ఫరవాలేదు.
సినిమా ప్రథమార్థం ఫరవాలేదనిపించుకుంటుంది. ద్వితీయార్థంలో నరుక్కోవడాలు, రక్తపాతం వంటివి ఈ చిత్రాన్ని 'ఎ' సర్టిఫికెట్ కు అర్హం చేశాయి. వరుణ్ ను కొత్తగా మాస్ హీరోగా చూపించడం ఒక్కటే సినిమాలో ప్రధానమైన నావల్టీ. కొద్దినెలల క్రితమే వచ్చిన 'రైడ్'కు అతి దగ్గరగా ఉందనే ప్రేక్షకుల పెదవి విరుపులు సైతం ఫిల్మ్ మేకర్స్ కు తప్పవు. యూత్ ను ఆకట్టుకునే కీలకమైన గ్రేస్ పాయింట్ ఈ సినిమా టైటిల్. కుర్రాళ్లు ఆదరిస్తేనే ఈ 'కుర్రాడు' నిలబడతాడు. లేకుంటే అంతే...