'కుర్రాడు' రివ్యూ
దర్శకుడు సందీప్ గుణ్ణం రీమేక్ ను ఎంచుకోవడం వల్లనే ఏమో కానీ ఎక్కడా తొట్రుపాటు లేకుండా కథను సాఫీగా నడిపించారు. కొన్ని సన్నివేశాలను సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. అయితే నేరేషన్ లో తగినంత వేగం లోపించింది. విలన్ పాత్రధారి తన డెన్ లో ఐటెం సాంగ్ ఎంజాయ్ చేస్తూ హీరోని సదరు డాన్సర్లుతో ఊహించుకోవడం కన్విన్సింగ్ గా లేదు. తమిళ వెర్షన్ లో లేని ఆలీ కామెడీ ట్రాక్ ను దర్శకుడు హ్యాండిల్ చేసిన తీరు సైతం కేవలం సినిమా నిడివి పెంచడానికి మాత్రమే పనికొచ్చింది.
వరుణ్ సందేష్ తొలిసారి కత్తిపట్టి ఫైట్స్ చేసినప్పటికీ అతని లుక్స్ 'లవర్ బాయ్' ఇమేజ్ కే ఎక్కువగా సూటయ్యేలా ఉన్నాయి. 'ఫైట్స్' చేయడం కంటే మరికొంత కాలం రొమాంటిక్ రోల్స్ కంటిన్యూ చేయవచ్చు. కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలు ఆలవోకగా చేసినప్పటికీ నిలువెత్తు విలన్ల ముందు 'కట్టెపుల్ల' (విలన్ చేత ఈ పదప్రయోగం కూడా చేయించారు)లా కనిపించాడు. ఇలాంటి మాస్ రోల్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఆయన తన ఫిజిక్ ను డవలప్ చేసుకోవాల్సి ఉంది. 'చిరుత'తో పోల్చుకుంటే నేహాశర్మ మరింత స్లిమ్ గా, హోమ్లీగా ఉంది. నటనలో మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వరుణ్ తల్లిదండ్రులుగా ప్రగతి, తనికెళ్ల భరణి చక్కటి నటన ప్రదర్శించారు. డాన్ గా 'బొమ్మాలి' రవిశంకర్ తన పాత్రకు న్యాయం చేశాడు. కామెడీ నటుడు వేణు అడపాదడపా నవ్వించారు. బ్యాంకు అప్పులు ఎగ్గొట్టేందుకు మారువేషాల్లో తిరిగే జంప్ జిలానీ పాత్రలో ఆలీ, తాగుబోతుగా ఎమ్మెస్ నారాయణ సరైన కామెడీ జనరేట్ చేయలేకపోయారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|