సంక్రాంతి ముందే సినీ మేలా
సంక్రాంతి వచ్చిందంటే పోటాపోటీ సినీ మేలా షురూ అవుతుంది. అయితే 2010 సంక్రాంతి మేలా కంటే ముందే ఈ ఏడాది డిసెంబర్ లో అగ్ర హీరోలు, యువకథానాయకులు బరిలోకి దూకేస్తున్నారు. ఇవాళ...రేపు అంటూ రిలీజ్ కు మీనమేషాలు లెక్కిస్తున్న పలు చిత్రాలన్నీ డిసెంబర్ మాసాన్ని టార్గెట్ చేసుకోవడంతో డబ్బింగ్ సినిమాలతో కలిసి దాదాపు రెండు డజన్ల సినిమాలు ఇదే సీజన్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఏడాదిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ 'ఆర్య-2' చిత్రం రిలీజ్ డేట్ కన్ ఫర్మ కాడవంతో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పలు చిత్రాలు సైతం తమ రీలీజ్ తేదీలను సవరించుకుంటూ డిసెంబర్ మొదటివారానికి జంప్ అవుతున్నాయి. అదే నెల మూడు, నాలుగు వారాల్లో క్రిస్మస్ కానుకగా పలు పెద్ద చిత్రాలు కూడా పోటీపడుతున్నాయి. ఈ సీజన్ లో హిట్ అయితే సంక్రాంతి సీజన్ లోకూ ఈ హవా కొనసాగుతుందని ఫిల్మ్ మేకర్స్ బలంగా విశ్వసిస్తుంటారు. సంక్రాంతి బరిలో ఇప్పటికే విక్టరీ వెంకటేష్ 'నమో వెంకటేశ', నాగార్జున 'మోసగాడు' (టైటిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) చిత్రాలు కన్ ఫర్మ్ అయ్యాయి.
'ఆర్య-2'తో మొదలు...
అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో విజయవంతమైన 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గా మళ్లీ ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఆర్య-2' చిత్రం భారీ అంచనాల మధ్య ఈనెల 27న విడుదలవుతోంది. తొలుత 25న అనుకున్నప్పటికీ టెక్నికల్ వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో కొత్త తేదీ ఖరారైంది. దీంతో జగపతిబాబు కథానాయకుడుగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన 'మా నాన్న చిరంజీవి' చిత్రం ఈనెల 25వ తేదీ నుంచి డిసెంబర్ మొదటివారంలోకి వెళ్లిపోయింది. ఈనెల 19న విడుదల తేదీని ప్రకటించిన 'సారాయి వీర్రాజు' చిత్రం సైతం 27వ తేదీకి వాయిదా పడింది. అజయ్ కథానాయకుడుగా డి.ఎస్.కణ్ణన్ దర్శకత్వంలో పి.ఆర్.కె.రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఆర్య-2'కు 'సారాయి వీర్రాజు' ఎలాంటి పోటీ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|