సంక్రాంతి ముందే సినీ మేలా
మొదటివారంపైనే చూపు...
డిసెంబర్ లో భారీ అంచనాలతో విడుదలవుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ 'అదుర్స్', మంచు విష్ణువర్దన్ 'సలీమ్', రానా (తొలి పరిచయం) 'లీడర్' వంటివి ఉన్నాయి. అయితే ఇవన్నీ డిసెంబర్ మూడు, నాలుగు వారాలను టార్గెట్ గా చేసుకున్నందున మొదటి రెండు వారాల్లో పలు చిత్రాలు రిలీజ్ కు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే విడుదల తేదీలను ప్రకటించిన వాటిల్లో జగపతిబాబు 'ప్రవరాఖ్యుడు', వైభవ్ 'కాస్కో' ఉన్నాయి. మదన్ దర్శకత్వంలో 'ప్రవరాఖ్యుడు', జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'కాస్కో' తెరకెక్కాయి. ఈ రెండు చిత్రాలు డిసెంబర్ 4న విడుదల కానున్నాయి.
'అదుర్స్' వెర్సస్ 'సలీమ్'
వ్యాపారపరంగా స్థాయి పెంచే హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ 'అదుర్స్' చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. 'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత ఎన్టీఆర్- దర్శకుడు వి.వి.వినాయక్ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 900 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. నయనతార, షీలా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదల చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు.
ఇదే రోజు విష్ణు, ఇలియానా జంటగా రూపొందుతున్న 'సలీమ్' (దుమ్ము రేపుతాడు) చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ -రిలయెన్స్ సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వం వహించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3-
|