సంక్రాంతి ముందే సినీ మేలా
ఇంకా...
'హ్యాపీడేస్' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న 'లీడర్' చిత్రం ఇప్పటికే పబ్లిసిటీ పరంగా అందర్నీ ఆకట్టుకుంటోంది. డాక్టర్ డి.రామానాయుడు మనువడు రానా ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతుండగా, ప్రతిష్ఠాత్మక ఎవిఎం సంస్థ నిర్మిస్తోంది. డిసెంబర్ చివరి వారాన్ని ఈ చిత్రం టార్గెట్ చేసుకుంది. జెనీలియా కథానాయికగా శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో గుణ్ణం గంగరాజు నిర్మిస్తున్న థ్రిల్లర్ 'కథ', భూమిక-స్నేహ ప్రధాన పాత్రధారులుగా రవిబాబు దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ 'అమరావతి', శివాజీ హీరోగా నటిస్తూ తొలిసారి నిర్మాతగా మారి రూపొందించిన 'తాజ్ మహల్' చిత్రాలు కూడా ఇదే సీజన్ లో (మొదటివారం కావచ్చు) విడుదలకు రెడీగా ఉన్నాయి. వీటికితోడు పోసాని కృష్ణమురళి 'జెంటిల్ మేన్', సాయిరాం శంకర్ 'వాడే కావాలి', మంచు మనోజ్ 'బిందాస్', తరుణ్ 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి', నితిన్ 'కాస్కో', నవదీప్-కాజల్-నిఖిల్ ప్రధానపాత్రధారులుగా శేషు ప్రియాంక చలసాని నిర్మిస్తున్న 'ఓం శాంతి', నిఖిల్-శ్వేతబసు జంటగా ఎల్.సురేష్ దర్శకత్వం వహిస్తున్న 'కళావర్ కింగ్', రిషి హీరోగా బివివి చౌదరి దర్శకత్వం వహించిన 'దమ్మున్నోడు', కిరణ్ రాథోడ్ కథానాయికగా నరసింహ నంది దర్శకత్వం వహించిన 'హైస్కూలు' చిత్రాలు కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కానున్నాయి. సీతాకాలంలో వేడిపుట్టించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రాల్లో ఎన్ని బాక్సాఫీస్ ను ఆకట్టుకుంటాయనేది చూడాలి.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|