చెన్నైకి షూటింగ్ లు ఛలో!
ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఆందోళనలు చిత్ర పరిశ్రమను కకావికలం చేస్తుండటం పొరుగున ఉన్న తమిళనాడు చిత్ర పరిశ్రమ లబ్ది పొందేందుకు మార్గం సుగమమవుతోంది. తెలంగాణ ఆందోళనతో షూటింగ్ లకు అంతరాయం కలగడంతో పలువురు నిర్మాతలు తమ షూటింగ్ ల మకాం చెన్నైకి మార్చే యోచనలో ఉన్నారు. హైద్రాబాద్ లో షూటింగ్ కు ప్లాన్ చేసిన తమిళ సినీ నిర్మాత శశికుమార్ ఇప్పుడు చెన్నై లో షూటింగ్ కే మొగ్గుచూపుతున్నారు.
తమిళనాట గత రెండేళ్లుగా సక్సెస్ ఫుల్ దర్శకనిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న శశికుమార్ ఇంకా పేరు పెట్టని తన తాజా చిత్రం షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక పోర్షన్ ను లీజ్ కు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులు సినిమా యూనిట్లపైన, వ్యక్తులపైన దాడులు జరుపుతున్నారని తెలియగానే ఆయన తన చిత్రాన్ని చెన్నై పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసేందుకు ఆయన నిశ్చయించారు. సహజంగా తన సినిమాలు నాలుగు నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తుంటాననీ, ఎలాంటి అవాంతరాలు తలెత్తినా తట్టుకోవడం తనవల్ల కాదనీ ఆయన తేల్చిచెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|