'మానాన్న చిరంజీవి' రివ్యూ
దర్శకుడు అరుణ్ ప్రసాద్ కేవలం మూడు ప్రధాన పాత్రల మధ్య జరిగే సంఘర్షణతో సినిమా మొదలుపెట్టి నీలిమి పాత్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కోణం నుంచి మరిన్ని బలమైన సన్నివేశాలు సినిమా ద్వితీయార్థంలో అల్లుకుని ఉంటే ఎంచుకున్న కథకు పరిపుష్టి కలిగేది. తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగాలు, సెంటిమెంట్ సన్నివేశాలు ఒక్కోసారి 'ఓవర్ డోస్' అనిపించకమానదు. కథ అలాంటిది కాబట్టి సర్దుకోవాలి. కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా కథను నడిపిన దర్శకుడి ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. కథ బాగున్నా కథనం బిగువుగా ఉండేలా చూసుకోవడంలో ఆయన మరింత కృషి చేసి ఉండాల్సింది. నీలిమ హఠాత్తుగా ఊడిపడి భర్తకు దగ్గరైనట్టు చూపించడం వల్ల కథ సుఖాంతమవుతుందోమో కానీ అందుకోసం ఆమె పడిన ఘర్షణ, వచ్చిన పరివర్తన ఎస్టాబ్లిష్ కాదు కదా. ఆలీ, బ్రహ్మానందం 'దందా' చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు కేవలం ఓ తంతుగానే మిగిలిపోయి నిడివిని పెంచుకోవడానికే ఉపకరించడం కనిపిస్తుంది.
జగపతిబాబుకు ఇందులో టైలర్ మేడ్ రోల్ దొరకడంతో ఎంతో చక్కగా తన పాత్రను పోషించారు. భార్య చీదరించుకున్నప్పుడు బాధపడటం,ఆమెకు ఎదురుచెప్పలేకపోవడం, తన కష్టం తన కొడుక్కి తెలియకూడదని జాగ్రత్త పడే సన్నివేశాల్లో జగపతిబాబు లీనమై నటించారు. మాస్టర్ అతులిత్ తో కనిపించిన దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ పరిణతి చెందిన నటన ప్రదర్శించారు. మాస్టర్ అతులిత్ చిచ్చరపిడుగని మరోసారి ('తులసి' తర్వాత) నిరూపించుకున్నాడు. నీలిమి పాత్ర నిడివి తక్కువే అయినా 'శుభలగ్నం'లో ఆమనిని తలపించింది. ప్రిన్స్ పాల్ గా ఎమ్మెస్ నారాయణ పాత్రలో కామెడీ పంచ్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం, ఆలీ పాత్రల్లో పసలేదు. ఒక సన్నివేశంలో నటించిన ఝాన్సీ, ఘరానా పెద్దమనిషిగా జయప్రకాష్ రెడ్డి, జగపతిబాబును ఆదుకునే పాత్రలో తెలంగాణ శకుంతల, మరో పాత్రలో సత్యం రాజేష్ ఉన్నంతలో బాగానే నటించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|