'మానాన్న చిరంజీవి' రివ్యూ
సాంకేతికపరంగా భరణి కె.ధరన్ ఫోటోగ్రఫీ ఫరవాలేదు. హేమచంద్ర సంగీతం నిరాశపరిచింది. మూడు పాటల్లో గుర్తుండిపోయే ట్యూన్ ఒక్కటీ కనిపించదు. 'స్టాక్ లూ సాఫ్ట్ వేర్ లు తెలియకపోవచ్చు. నీకు బంధాల గురించి తెలియదు..తెలుసుకుంటావు', 'హైదరాబాద్ పట్టణానికి వచ్చిన వాళ్లలో టూరిస్టు ఎవరో టెర్రరిస్టు ఎవరో తెలియదు' వంటి కొన్ని సంభాషణలు ఆకట్టుకుంటాయి. లాఫింగ్ లార్డ్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ విలువలు తగినట్టుగానే ఉన్నాయి.
ప్రథమార్థంలో చెప్పుకోదగిన ట్విస్ట్ లు, కథలో మునిగిపోయే అంశాలు తక్కువే అయినా ద్వితీయార్థం కొంత పట్టుగా సాగింది. కొన్ని సన్నివేశాలు గుండె బరువు పెంచుతాయి. హడావిడి ముగింపు అహ్లాదపరచేలా లేదు. మాస్ కు పట్టే అవకాశాలు మృగ్యం. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ , మహిళా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమా కావడంతో ఆ తరహా ప్రేక్షకులు గడపదాడి బయటకు వస్తేనే ఎంతోకొంత ఆదరణ లభించొచ్చు. ముందున్నది సంక్రాంతి సీజన్ కావడంతో అప్పటి వరకూ గట్టి ప్రమోన్ తో నిలపాల్సి ఉంటుంది. అంతే...

Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|