'బిందాస్' రివ్యూ
'అజయ్ గాడి విజయ గాథ' అనే ట్యాగ్ లైన్ లోనే అసలు కథ ఉంది. ఎప్పుడూ బిందాస్ గా (హ్యాపీగా) ఉండాలని కోరుకునే యువకుడు అజయ్ (మనోజ్ కుమార్). అతని పెదనాన్న మహేంద్ర నాయుడు (ఆహుతి ప్రసాద్) ఓ రాజకీయవేత్త. మహేంద్ర నాయుడు, శేషాద్రి నాయుడు (జయప్రకాష్ రెడ్డి) ఒకే పార్టీకి చెందిన నాయకులే అయినా రాజకీయంగా ఇద్దరూ ప్రత్యర్థులు. పార్లమెంటు ఎలక్షన్లకు నోటిఫికేషన్ వెలువడుతుంది. పార్టీ సీనియర్ నేత (విజయకుమార్) మధ్యవర్తిత్వం చేయడంతో ఎంపి సీటును మహేంద్రనాయుడికి డిక్లేర్ చేస్తారు. దాంతో శేషాద్రినాయుడు భగ్గుమంటాడు. ఇదే తరుణంలో శేషాద్రినాయుడు బావమరిది గరిక నాయుడు (జీవా) హత్యకు గురికావడంతో ఇది మహేంద్రనాయుడు పనేనంటూ శేషాద్రినాయుడు పగబడతాడు. అతని వల్ల తన కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరుగుతుందోనని భావించిన మహేంద్రనాయుడు ఎక్కడొక్కడో ఉన్న తన కుటుంబ సభ్యులందర్నీ తన దగ్గరకు రప్పించుకుంటాడు. తమ్ముడు కొడుకైన అజయ్ కు కూడా కబురుపెట్టడంతో అజయ్ కూడా ఆ బెటాలియన్ లోకి వచ్చి చేరుతాడు. అయితే పెదనాన్నతో సహా అక్కడున్న ఎవ్వరికీ అజయ్ అంటే ఇష్టం ఉండదు. వాళ్లెంత ద్వేషిస్తున్నా అజయ్ మాత్రం వారిని సరదాగా ఆట పట్టిస్తూ అందర్నీ కలుపుకొని పోతుంటాడు. తన మరదలైన గిరిజ (షీనా)ను కూడా అల్లరి పట్టించి ఓ దశలో ఆమె మనసు కూడా దోచుకుంటాడు. ఈ క్రమంలో శేషాద్రినాయుడు, మహేంద్ర నాయుడు కుటుంబాల మధ్య కక్షలు మరింత ముదిరి పరిస్థితులు విషమిస్తాయి. గరిక నాయుడు హత్య కారణంగా ఇరుకుటుంబాల మధ్య తలెత్తిన మనస్పర్థలను తొలగించేందుకు అజయ్ నడుం బిగిస్తాడు. అతను తన ప్రయత్నంలో ఏవిధంగా సక్సెస్ అయ్యాడనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: -1- 2 -3- -4-
|