'బిందాస్' రివ్యూ
దర్శకుడు వీరుపోట్ల ఎంచుకున్న స్టోరీలైన్ లో ఒకప్పటి 'కలిసుందా...రా' చిత్రం షేడ్స్ కనిపిస్తాయి. అయితే ఆయన ఎంతో చాకచక్యంగా
కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్, అవసరమైన మోతాదులో యాక్షన్, తగినంత రొమాన్స్ చేర్చి దర్శకుడిగా తన భవిష్యత్ కెరీర్ కు గట్టి పునాది వేసుకున్నారు. మొదటి పది పదిహేను నిమిషాలు మినహాయిస్తే అసలు కథ మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులను అందులో ఇన్ వాల్వ్ చేయడంలో దర్శకుడు పడిన తపన కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్టాఫ్ కు బలమైతే..సెకెండాఫ్ లో దిగ్గజాల్లాంటి కమెడియన్లతో దర్శకుడు కనికట్టు కట్టారు. హీరో క్యారెక్టరైజేషన్ ను వీరుపోట్ల తీర్చిదిద్దిన తీరు సైతం అభినందనలు అందుకుంటుంది.
పాత్రపరంగా ఎంతో కూల్ గా కనిపిస్తూ...సందర్భాన్ని బట్టి ఫైర్ అవుతూ మనోజ్ తనలో ఓ మంచి నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నారు. 'నేను మీకు తెలుసా', 'ప్రయాణం' చిత్రాలతో నటనలో వైవిధ్యం కోసం మనోజ్ పడుతున్న తపనకు ఈసారి సరైన గుర్తింపు
వచ్చినట్టే. సంభాషణలు పలకడంలో తన తండ్రి మోహన్ బాబును ఇమిటేట్ చేసినప్పటికీ క్యారెక్టరైజేషన్ పరంగా అది యాప్ట్ గా ఉంది.
ఎంతో ఈజ్ తో సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో లాగించడం ద్వారా తన కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫిల్మ్ అని చాటుకున్నారు. షీనా మరీ చిన్నపిల్లలా అనిపించినా ఎంతో ఫ్రెష్ గా అందంగా ఉంది. పాటల్లో ఆలవోకగా అందాలు ప్రదర్శించింది. ఆహుతి ప్రసాద్ పెద్దగా ప్రతిభను కనబరచే అవకాశం లేకపోయినప్పటికీ తన పాత్రను సునాయాసంగా చేశారు. జయప్రకాష్ రెడ్డి ఈ తరహా పాత్రలో వందలాది సార్లు చేశారు. కాకుంటే ఇందులో ఆయన ఎంటర్ టైన్ మెంట్ జోలికి వెళ్లకుండా సీరియస్ విలనీ చేశారు. బ్రహ్మానందం, రఘుబాబు, మాస్టర్ భరత్, సునీల్, ఒకే సన్నివేశంలో కనిపించిన ఎమ్మెస్ నారాయణ చక్కటి కామెడీ పంచ్ లతో వినోదం పంచారు. ముద్దుకృష్ణగా 'వెన్నెల' కిషోర్ సైతం నవ్వులు పూయించారు. సుబ్బరాజు, సుప్రీత్, కాశీ విశ్వనాథ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|