'బిందాస్' రివ్యూ
సాంకేతికపరంగా రమేష్ బాబు ఫోటోగ్రఫీ పనితనం కనిపిస్తుంది. ముఖ్యంగా పాటలు, ఫైట్స్ లో. బోబో శశి అందించిన సంగీతం ఫరవాలేదనిపిస్తుంది. ఉన్నంతంలో 'సురాంగనీ...', 'గిరిజా నీ మీదే ధ్యాస' పాటలు, చిత్రీకరణ ఆకట్టుకుంటాయి. చిన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తగినట్టుగానే ఉంది. సినిమాకి వీరుపోట్ల సంభాషణలు ప్రధాన బలం. చాలాచోట్ల ఈ సంభాషణలు చక్కిలిగింతలు పెడతాయి. 'గిరిజలా ఉండటం కాదు..గిరిజ లాగూ వేసుకుంది', 'పిల్లాడిది ఎక్కడుంది? (ముస్లిం పీర్ ఎమ్మెస్ నారాయణ)...పిల్లాడి దగ్గరే ఉంది (సునీల్ జవాబు), 'హీరోలు ముందరా రారు...వెనకా రారు...సరిగ్గా సమయానికి వస్తారు' (బ్రహ్మానందం), 'ఇంట్లో విశ్వనాథ్ లా బయట రాఘవేంద్రరావులా సినిమా చూపిస్తోంది' (షీనాను ఉద్దేశించి మనోజ్), 'నేను సాఫ్ట్ వేర్ వాడినైనా బాగా హార్డ్ గా వ్యవహరించారు' (సునీల్), 'పిచ్చికుక్కలా చూడకుండా హచ్ కుక్కలా చూడాలంటే ఒకటి చేయాలి' (వెన్నెల కిషోర్ తో మాస్టర్ భరత్), 'ఈ ప్రపంచంలో నాకు నచ్చనివి రెడు. ఒకటి నువ్వు. రెండు..సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా' (షీనాతో మనోజ్) వంటి సంభాషణలు మచ్చుకు కొన్ని.
నిర్మాత సుంకర రామబ్రహ్మం మంచి నిర్మాణ విలువలు పాటించారు.
సినిమా ప్రథమార్థం లవ్, యాక్షన్, కామెడీతో ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థం కామెడీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఊహించిన విధంగానే క్లైమాక్స్ సుఖాంతమవుతుంది. ఎంటర్ టైన్ మెంట్, సంభాషణలు, మంజు మనోజ్ నటన సినిమాకి ప్రధాన హైలైట్స్. మ్యూజిక్ మరింత మెరుగ్గా ఉండొచ్చు. వీరుపోట్ల టేకింగ్, కామెడీ టైమింగ్ (ప్రెజంటేషన్) వంటివి అనుభవమున్న దర్శకుడిని తలపిస్తాయి. ఏ అంచనాలు లేకుండా 'బిందాస్'కు వెళ్తే...హ్యాపీగా తిరిగిరావచ్చు. బాక్సాఫీస్ స్టామినా కూడా బలంగానే ఉంది. హిట్ డిక్లేర్ కావచ్చు...
Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|