కాంతారావు మధురస్మృతులు
కళకు భాష, ప్రాంతీయ భేదాలు లేకున్న తెలంగాణా నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన ఏకైక నటుడు కాంతారావు. కత్తి కాంతారావుగా, ఆంధ్ర ఎమ్జీఆర్ గా, కళాప్రపూర్ణుడుగా ఐదున్నర దశాబ్దాల నటచరిత్రతో ఎఎన్ ఆర్, ఎన్టీఆర్ వంటి నగదిగ్గజాలతో సమాంతరంగా ఎదిగిన 'నట' ప్రపూర్ణుడు. కళాకారుడికి కళలోనే తృప్తి ఉంటుందని, అక్కడ సంపాదించిన ప్రతి రూపాయి మళ్లీ అదే రంగానికి వెచ్చించిన కళాపిపాసి. సంపాదించిన రోజుల్లో నాలుగు డబ్బులు వెనకేసుకుని చివరి రోజుల్లో హాయిగా బతికాలనే మర్మం తెలియని నిస్వార్థ జీవి. నిర్మాతగా ఒకటి రెండు సక్సెస్ లు చివిచూసి చివరకు విధికి ఎదురీదారు. ఆయన నిర్మించిన చిత్రాలు ఫెయిలయి ఆర్థికంగా చితికిపోయారు. సొంత ఇల్లు లేక, పోషణకు కూడా కష్టమై ఆర్థికంగా దెబ్బతిన్నారు. అయినప్పటికీ మొక్కవైని ధైర్యంతో జీవితాన్ని ఎదురీదారు. టీవీ సీరియల్స్ లోనూ నటించారు. ఆలస్యంగానైనా ఆయనకు తగురీతిగా పరిశ్రమ సత్కరించుకుంది. కళాప్రపూర్ణుడిని రఘుపతి వెంక్కయ్య అవార్డుతో సన్మానించింది. ప్రభుత్వ నంది అవార్డులు, ఎన్టీఆర్ జాతీయ అవార్డుల కమిటీకి మెంబర్ గా తన విధి నిర్వహించారు. తన అనుభవాలను రంగరించి రాసిన స్వీయకథ 'అనగనగా ఒక రాకుమారుడు'కు నంది అవార్డు లభించింది. కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి 2006 నవంబర్ లో కాంతారావును సన్మానించి రూ.5 లక్షలు బహూకరించారు. నటుడిగా, వ్యక్తిగా సమున్నతుడనిపించుకున్న కాంతారావు మరికొంత కాలం ఉండే బాగుండేదని అనుకోని కళాహృదయం ఉండకపోవచ్చు. విధి బలీయమన్నట్టు కాంతారావు సుదీర్ఘ అశ్వస్థతతో దీర్ఘకాల నిద్రలోకి వెళ్లిపోయారు.
'ప్రతిజ్ఞ'
నటుడిగా ఆయన కెరీర్ ను పరిశీలిస్తే అనేక సంఘటనలు మన కళ్ల ముందు మొదలుతాయి. సురభి నాటకాల పట్ల ఆకర్షితుడైన కాంతారావు నటుడు కావాలనే తపనతో మద్రాసు రైలెక్కారు. 1955లో హెచ్.ఎం.రెడ్డి రోహిణి పిక్చర్స్ పతాకంపై రూపొందించిన 'ప్రతిజ్ఞ' కాంతారావు తొలిచిత్రం. తొలిచిత్రమే తెలుగు, తమిళ భాషల్లో రూపొందడం ఓ రికార్డు. తెలుగులో 'ప్రతిజ్ఞ'గా, తమిళంలో 'వంజమ్' గా విడుదలై రెండు భాషల్లోనూ శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. దీంతో కాంతారావు వెనుదిరిగి చూసుకోలేదు. రెండో చిత్రం 'కన్యాదానం'. మూడో చిత్రం 'జయసింహ' సూపర్ డూపర్ హిట్. ఇందులో ఎన్టీఆర్ తమ్ముడుగా కాంతారావు నటించారు. ఆయన తర్వాత ఎన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఒకరకంగా ఎన్టీఆర్ కు సమాంతర నటుడిగా...కొండొకచే ఆయనకే పోటీ ఇచ్చిన నటుడాయన. ఇద్దరూ కలిసి 'లవకుశ', 'చిక్కడు దొరకడు', 'ఏకవీర', 'భట్టి విక్రమార్క', 'రక్తసంబంధం' వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|