'రెచ్చిపో' రివ్యూ
రెచ్చిపో...అనే పదం అందరూ ఏదో ఒక సందర్భంలో అంటూనే ఉంటాం. అలా అనడంలో ఓ కిక్...జోష్ ఉంటుంది. అదే సినిమా టైటిల్ అయినప్పుడు హీరో ఫైట్స్ తో ఇరగదీస్తాడని మాస్ అనుకుంటారు. యువజంట కలిసి నటిస్తే ప్రేమలో రెచ్చిపోయి ఉంటారని యూత్ అంచనాలు వేస్తారు. రెచ్చిపోవడం అనేది ఏ అర్థంలో తీసుకున్నా రెచ్చిపోవాలనుకున్న వాళ్లకు మాత్రం బోలెడంత ఎనర్జీ మాత్రం ఉండితీరాలి. తొలి నాళ్లలో హ్యాట్రిక్ హిట్లిచ్చిన నితిన్ ఇటీవల కాలంలో బాడీలాంగ్వేజ్ నుంచి స్టయిలిష్ లుక్ వరకూ ఎంత కేర్ తీసుకుంటున్నా ప్రేక్షకులు కేర్ చేయడం లేదు. సహజంగా సినిమా రంగంలో కష్టానికి లక్ తోడయితేనే సక్సెస్ వరిస్తుంటుంది. నితిన్ కష్టంలో లోపం లేదు. ఎటొచ్చీ లక్ మాత్రం ముఖం చాటేస్తోంది. అలాగే దర్శకుడు పరుచూరి మురళి సైతం 'ఆంధ్రుడు' తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని సక్సెస్ కోసం కసితో ఉన్నారు. ఈ ఇద్దరికీ అనివార్యమైన సక్సెస్ కు ఇప్పుడు ఇలియానా 'లేడీ లక్' జోడించి 'రెచ్చిపో' (ఫర్ లవ్) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. పరిమిత పబ్లిసిటీ వల్ల ఎక్కడా హైప్ లేకుండా ఫిల్మ్ మేకర్స్ మొదట్నించీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. హీరో పక్కా మాస్, హీరోయిన్ పక్కా గ్లామర్, మొదట్నించీ చివరి వరకూ కామెడీ కోటింగ్....వెరసి దర్శకులకు నల్లేరు మీద నడకలాంటి కమర్షియల్ ఫార్ములా ఇది. సరిగ్గా పరుచూరి మురళి ఇదే చేశారు. సందేశాలు, సెంటిమెంట్లు, ఫ్లాష్ బ్యాక్ ల జోలికి వెళ్లకుండా స్ట్రయిట్ నేరేషన్ తో సినిమాను తెరకెక్కించారు. ఈ ప్రయత్నంలో కొన్ని లాజిక్ లు పట్టించుకోలేదు. మరింత లోతుల్లోకి వెళితే...
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3- -4-
|