'రెచ్చిపో' రివ్యూ
సాంకేతికపరంగా సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ పనితనం మెచ్చుకోలుగా ఉంది. మణిశర్మ సంగీతంలో ఫాస్ట్ బీట్ లో ఎక్కువ. 'వేరెవర్ యు గో రెచ్చిపో', 'ఓరిదోవుడో అంజనేయుడో అమ్మడు అదిరింది' వంటి పాటలు మాస్ కు దగ్గరగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తగినట్టుగానే ఉంది. మరేష్, గోపి సంభాషణల్లో ద్వంద్వార్ధాలు బాగానే దొర్లాయి. 'మనది ఓట్లు వేయుంచుకునే వయస్సు...ఓటు వచ్చిన వయసు వాళ్లది' (హోమంత్రితో ముఖ్యమంత్రి), 'ఇపుడు టోటల్ గా ఎర్రగడ్డ' (రఘుబాబు) వంటి సందర్భోచిత సంభాషణలు అక్కడక్కడా కనిపిస్తాయి. సెల్వ కంపోజ్ చేసిన ఫైట్స్ లో మంచి ఫైర్ కనిపించింది. ముఖ్యంగా ఎడారిలో ఛేజింగ్ ఘట్టం ఆకట్టుకుటుంది. క్లైమాక్స్ ఫైట్ కూడా మాస్ కు పట్టేదే. జీవి రమణ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
సినిమా ప్రథమార్థంలో లవ్, కామెడీ వంటి అంశాలున్నప్పటికీ అసలు కథ సరైన ట్రాక్ లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టింది. ద్వితీయార్థంలో దర్శకుడు పట్టు బిగించారు. ఫస్టాఫ్ లో ఒక్క ఫైట్ కూడా లేని లోటును ద్వితీయార్థంలో భర్తీ చేశారు. ఇలియానా గ్లామర్, నిర్మాణ విలువలు, కొంత కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు. నితిన్ సినిమాకి ఇటీవల కాలంలో మంచి ఓపినింగ్స్ రావడం బహుశా ఈ చిత్రానికే జరిగి ఉండొచ్చు. ఇలియానా ఫేక్టర్ ఇందుకు ప్రధాన కారణం. దసరా సీజన్ కావడం, మాస్ కు పట్టే మషాలా అంశాలు ఉండటం బోనస్ పాయింట్లు కావచ్చు. కమర్షియల్ హిట్ కు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ లు ఉన్నాయి.

Be first to comment on this News / Article!
Pages: -1- -2- -3- 4
|