'రెచ్చిపో' రివ్యూ
దర్శకుడు పరుచూరి మురళి కథలో కొన్ని రీజినింగ్ కు అందని అంశాలు కనిపిస్తాయి. 500 కోట్లతో పరారైన హీరో కారు ఓ గోతిలో పడిపోతుంది. ఆ తర్వాత డబ్బెక్కడ దాచాడనేది చూపించరు. పోనీ చివర్లో అయినా ఆ సొమ్ము వివరం చెప్పడానికి హీరో ఇష్టపడడు. హోం మంత్రి ఒక ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ను పట్టుకునేందుకు దొంగను ఆశ్రయించడం అంటే డిపార్ట్ మెంట్ మీద నమ్మకం లేకపోవడమే కారణమని అనుకోవాల్సి వస్తుంది. హోం మంత్రి పవర్స్ ఏమైనట్టు? కమిషనర్ సైతం హీరో దొంగని తెలిసీ సపోర్ట్ చేస్తుంటాడు. ఇలాంటివి ఫన్నీగా అనిపిస్తాయి. దర్శకుడు మరింత కేర్ తీసుకుని ఉండొచ్చు.
నితిన్ గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన మరింత స్టయిల్ గా, ఎనర్జటిక్ గా కనిపించారు. ఫిజికల్ ఫిట్ నెస్ ముచ్చట గొలుపుతుంది. అలాగే డాన్స్ లకు పలు సందర్భాల్లో క్లాప్ లు పడతాయి. ఇలియానా గ్లామర్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నితిన్ కు పెర్ ఫెక్ట్ జోడిగా పలు సందర్భాల్లో అనిపిస్తుంది. కొద్దిగా ఒళ్లు చేయడంతో పాటు ఆమెకు వాడిన కాస్ట్యూమ్స్ సెక్స్ అప్పీల్ ను పెంచాయి. నటన ఓకే. ఆహుతి ప్రసాద్, భానుచందర్ నటనలో పస లేదు. విలన్ పాత్రధారి చివరి ఫైట్ లో మినహాయిస్తే పెద్దగా కష్టపడినది కనిపించదు. హోం మంత్రి పి.ఏ.గా ఎమ్మెస్ నారాయణ మరోమారు తాగుబోతుగా కనిపించినా మంచి హ్యూమర్ పండించారు. ఫస్టాఫ్ కు బలం కూడా ఆయన కామెడీనే. సునీల్, సుమన్ శెట్టి కామెడీ సాదాసాదీనే. దుబాయ్ లో కాల్ టాక్సీ డ్రైవర్ జింబాబ్వేగా రఘుబాబు తనదైన శైలిలో నటించి కొద్దిపాటి నవ్వులు అందించారు. రమాప్రభ నటిస్తే సినిమా హిట్టనే సెంటిమెంట్ ఒకటుంది. ఆ మాటెలా ఉన్నా రమాప్రభ నటన మరోసారి ఆకట్టుకుంటుంది. చివరి రోజుల్లో మిమ్మల్నిందరీ చూద్దామని ఈ పెళ్లికి వచ్చానురా అన్నప్పుడు ఆమె నటనానుభవం ఏమిటో అర్ధమవుతుంది.
Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3 -4-
|