సీమ ఉద్యోగ మేళా
కడప : నిరుద్యోగులకు, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉద్యోగవకాశాలు కల్పించేందుకు గాను ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నారు. సీమ జిల్లాలకు చెందిన విద్యార్థులంతా ఈ మేళాకు హాజరుకావచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 14న స్థానిక వీబీఐటీ కళాశాల ఆవరణలో ఈ మేళా జరగనుంది. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తయిన నిరుద్యోగులతో పాటు పైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని నిర్వాహకులు వివరించారు.
News Posted: 5 February, 2010
|