కటంగూరు కన్నుమూత
సోషలిస్టు పార్టీ నిర్వహించిన ఆహార సరుకుల పంపిణీ సత్యాగ్రహంలో నర్సింహారెడ్డి పాల్గొని జైలుకు వెళ్ళారు. జైల్లో ఖైదీల కనీస సౌకర్యాల సాధన కోసం నిరాహార దీక్ష చేశారు. భూ పరిమితి సంస్కరణల ఉద్యమంలో పాల్గొని భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు వేల ఎకరాల ప్రభుత్వ భూములను పంచిపెట్టారు. గిరిజనుల ఆధీనంలో ఉన్న బంజరు భూములపై పట్టా హక్కులను కల్పించడం కోసం మహదేవ్ పూర్ నుండి మంధిని, పరకాల మీదుగా హైదరాబాద్ కు పాదయాత్ర చేశారు. రాజకీయ కార్యకర్తలపై ప్రభుత్వం మోపిన తప్పుడు కేసులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసి కార్యకర్తలను విడిపించారు. నిజాం మిలటరీ అవినీతి కార్యక్రమాలకు నిలయమైన హన్మకొండలో విచిత్ర, వినోద ప్రదర్శలను తగలపెట్టిన సంఘటనలో ఆయన పాల్గొన్నారు.
స్వాతంత్ర్య అనంతరం 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థుల గెపునకు కృషి చేశారు. 1962-1982 ప్రముఖ స్వాతంత్ర్య సమరయోదులు ఉత్తమ పత్రికా రచయిత, అభినవ అరిస్టాటిల్ గా పిలువబడి క్రీ.శే.పాములపర్తి సదాశివరావు మార్గ దర్శకత్వంలో 'విశ్వజ్యోతి' మాసపత్రిక ముద్రణ, సంపాదకత్వ నిర్వణ బాధ్యతలు ఆయన నిర్వహించారు. విశ్వజోతి పబ్లికేషన్ ద్వారా గెరిల్లా యుద్ధరీతిపై విప్లవ పోరాటాల అనుభవాలను, చైనా దురాక్రమణపై విశ్లేషనాత్మక ప్రచురణలను ముద్రించడంతో ప్రభుత్వంచే సాహితీ నిషేదానికి ఆయన గురయ్యారు. నాస్థిక వాది 'గోరాం' నిర్వహించిన సైద్ధాంతిక ఉద్యమం, మంత్రులు, ప్రజాసేవకులుగా సాధారణ జీవితం గడపాలన్న నినాదాన్ని ప్రతిధ్వనింప చేయడంలో ప్రముఖ పాత్రను నర్సింహారెడ్డి పోషించారు.
భారత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా లోక నాయక్ జయప్రకాష్ నారాయణ పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారు. 'ఓటేసినప్పుడే ఉండాలి బుద్ధి' అన్న కాళోజీ సూక్తికి ప్రాణం పోసే బాధ్యతతో మెట్టుపల్లి గ్రామంలో అభ్యర్థులను గెలిపించేది ఓటర్లేనని రాజకీయ పార్టీలుకాదని విస్తృత ప్రచారం చేశారు. కంటగూరు నర్సింహారెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యానికి గురైనారు. కాగా సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండాసురేఖ, మాజీ ఎంపి జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వాసుదేవ రెడ్డి, కేశవరావ్ జావెద్, జనార్థన్ రెడ్డి, ఇందుర్తి ప్రభాకర్ రెడ్డి సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. కటంగూరు నర్సింహారెడ్డి అంత్యక్రియులు హన్మకొండలోని స్మశానవాటికలోజరిగాయి.
Pages: -1- 2 News Posted: 12 August, 2009
|