ఉచితంగా కంప్యూటర్ శిక్షణ
గుంటూరు : సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట శివాలయం ఎదురు వీధిలోని శ్రీకంప్యూటర్స్ లో ఉచితంగా కంప్యూటర్స్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాక అధ్యక్షుడు పి.వి.ఎస్.చలపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. పేద విద్యార్థులకు మేలు జరగాలన్న లక్ష్యంతో ఈ ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తాన్నమని చెప్పారు. ఎం.ఎస్.ఆఫీస్, 'సి'లాంగ్వేజ్, డి.టి.పి. కోర్సుల్లో 40 రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తిగలవారు అరండల్ పేట 7/5లోని సేవా సంస్థాన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు. ఏప్రిల్ 6వ తేదీ లోపు దరఖాస్తులను కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. 7, 8, 9 తేదీలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, వివరాలకు 9177818283 ఫోన్ చేయాల్సిందిగా తెలిపారు.
News Posted: 3 April, 2009
|