పవన్ రోడ్ షోలకు నీరాజనం
అనంతపురం : ప్రజారాజ్యం యువనాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో మునుముందుకు దూసుకుపోతున్నాడు. మలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురంలో నిర్వహించిన పవన్ రోడ్ షోలకు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. పౌరుషం ఉట్టిపడేలా అచ్చమైన సీమ భాషలో పవన్ చేస్తున్న ప్రసంగాలు యుతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. హిందూపురం నుండి పెనుగొండ మీదుగా పవన్ అనంతపురం చేరుకుని, రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు.
News Posted: 17 April, 2009
|