12న మీనా వివాహం
తిరుపతి : తెలుగు చిత్ర సీమలో దశాబ్దం పాటు కుర్రకారుని ఉర్రూతలూగించిన నటి మీనా వివాహం రేపు తిరుమలలో జరగనుంది. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం ఏడు గంటలకు వివాహం జరగనున్నట్లు మీనా కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ వివాహా ఘట్టానికి మీడియాతో సహా ఎవ్వరినీ ఆహ్వానించడం లేదని, అతి ముఖ్యమైన 200 మంది అతిధులకు మాత్రమే శుభలేఖలు పంపినట్లు మీనా కుటుంబ వర్గాలు తెలిపాయి. బెంగుళూరుకు చెందిన బిజినెస్ మన్ విద్యాసాగర్ తో మీనా వివాహం జరగున్నట్లు మీనా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. `సీతారామయ్య గారి మనుమరాలు' చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మీన దాదాపు 150 చిత్రాల్లో పలుభాషల్లో నటించారు. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ అందరితోనూ నటించారు. ప్రస్తుతం మీనా వెంగమాంబ అనే పౌరాణిక చిత్రంలో నటిస్తోంది.
News Posted: 11 July, 2009
|