సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో కోట్లు
విజయవాడ : పడమట సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన యజ్ఞం నారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 3 కోట్ల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 3 నెలల క్రితం కృష్ణా జిల్లా కౌతువరానికి బదిలీ అయిన యజ్ఞం నారాయణ విధుల్లో చేరలేదు. నారాయణ ఇంటిపై అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
News Posted: 21 July, 2009
|