విజయవాడ : విజయవాడ నగరానికి అరుదైన పుస్కారం లభంచింది. నగరంలో మంచినీటిని సరఫరా చేయడంలో నూరు శాతం విజయం సాధించినందుకుగాను కేంద్ర స్థాయిలో రెండవ ఉత్తమ కార్పొరేషన్ పురస్కారం లభించింది. నగరంలో తాగునీటిని సరఫరా చేయడంలో నూరు శాతం విజయం సాధించడంతో నేషనల్ అర్బన్ వాటర్ - 2009 పురస్కారం విజయవాడకు లభించింది. కాగా ముంబై ఉత్తమ కార్పొరేషన్ గా మొదటి బహుమతిని గెలుచుకుంది.