విశాఖపట్నం : ప్రేమించిన ప్రియుడు పెళ్ళికి నిరాకరించడంతో అతనిపై యాసిడ్ తో దాడి చేసిందో ప్రియురాలు. విశాఖ జిల్లా కశింకోట మండలం తేగాడలో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిద్రిస్తున్న ప్రియుడిపై అర్ధరాత్రి ప్రియురాలు యాసిడ్ తో దాడి చేసింది. దీంతో గాయపడ్డ బాధితుడు చిన్నా ఎన్ డీఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.