గాజువాకలో లాకప్ డెత్
విశాఖపట్నం : నగరంలోని గాజువాక పోలీసు స్టేషన్ లో లాకప్ డెత్ జరిగింది. ఓ కేసు విషయంలో అరెస్టైన రౌడీషీటర్ గరికిన తాతారావు స్టేషన్ లోనే మరణించాడు. అయితే పోలీసులు మాత్రం విషయం బయటకు పొక్కనీయకుండా గుట్టుగా ఉంచి, మృతదేహన్ని కేజీహెచ్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిసట్టు పోలీసులు రిపోర్ట్ నమోదు చేయించారు. అయితే స్టేషన్ లోనే మరణించినట్టు కొద్దిసేపటి తరువాత బయటపడింది. పోస్టుమార్టం నివేదిక అందితేనే కానీ తాను ఏమీ చెప్పలేనని కమిషనర్ సాంబశివరావు వెల్లడించారు.
News Posted: 7 January, 2010
|