మెడికో ఆత్మహత్య
గుంటూరు : నగరంలోని కాటూరి మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్న కోవెలకుంట్ల శ్రీకాంత్ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్ ది కడప జిల్లాలోని బద్వేల్. ఆయన తండ్రి సుబ్బరాయుడు ఆయుర్వేద వైద్యుడు. కాలేజీలో శ్రీకాంత్ ఎప్పుడూ ముభావంగా, అన్యమనస్కంగానే వ్యవహరించేవాడని సహచర విద్యార్థులు తెలిపారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
News Posted: 4 February, 2010
|