'స్టార్' వార్!
రాజమండ్రి : రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో స్టార్ వార్ జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం అభ్యర్థిగా ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ పోటీ చేస్తుండగా, ప్రజారాజ్యం పార్టీ నుండి మరో ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు పోటీచేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుండి పోటీచేస్తున్న ఉండవల్లికి కూడా సినీరంగంతో సంబంధాలు ఉన్నాయి. ఆయననిర్మాతగా సురేష్ గోపి నటించిన మళయాళ సినిమాను తెలుగులోకి 'జర్నలిస్ట్' గా అనువదించారు. గతంలో పార్లమెంట్ స్థానాలకు సినీనటులు తలపడ్డా ఒకే చోట ఇద్దరు నటుల పోటీ లేదు. దీంతో రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో పోటీ రసవత్తరంగ మారే అవకాశం ఉంది.
News Posted: 2 April, 2009
|